Advertisement


Home > Movies - Movie News
అది అశ్లీలమా నాన్సెన్స్‌: ఆదా శర్మ

ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తి హీరోయిన్‌ ఆదా శర్మని ముద్దడిగాడట. వయసులో పెద్దవాడని లైట్‌ తీసుకున్న ఆదా శర్మ, అతడ్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయింది. అంతే, ఆ వ్యక్తికి కోపమొచ్చి 'సినిమాల్లో అయితే సిగ్గు లేకుండా ముద్దులిచ్చేస్తావా.? నేనడిగితే పట్టించుకోవా.?' అంటూ ఆమె వెంటపడేందుకు ప్రయత్నించాడు. పరిస్థితి చెయ్యిదాటుతోందని గమనించి, ఆదా శర్మ అక్కడినుంచి వడివడిగా వెళ్ళిపోయింది. 

ఇదీ జరిగిన సంఘటన. ఎలా చిక్కిందో ఈ వీడియో కెమెరాకి చిక్కేసింది. క్షణాల్లో వైరల్‌ అయిపోయింది. ఆదా శర్మ తీరుపై సోషల్‌ మీడియాలో ట్రాలింగ్‌ షురూ అయ్యింది. ఇందులో ఆమె తప్పేంటట.? అన్నవారే ఎక్కువ. కానీ, కొందరు మాత్రం ఆదా శర్మని ఉద్దేశించి జుగుప్సాకరమైన కామెంట్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఒళ్ళు మండిపోయిందామెకి. 

ఎప్పుడూ కూల్‌గా వుండే ఆదా శర్మ, తనను తాను కంట్రోల్‌ చేసుకోలేకపోయింది. సోషల్‌ మీడియాలో క్లాసులు తీసుకుంది. ఈ సందర్బంలోనే బోర్డర్‌ దాటేసి, 'వాడకూడని మాటల్నీ' సోషల్‌ మీడియాలో వాడేసింది. అదిప్పుడు వివాదాస్పదమవుతోంది. 'అశ్లీల పదాల్ని ప్రస్తావిస్తావా.?' అంటూ కొత్తగా మళ్ళీ ట్రాలింగ్‌ షురూ అయ్యింది. షరామామూలుగానే ఆదా శర్మకి మళ్ళీ ఒళ్ళు మండిపోయింది. 

'అది అశ్లీలమా.? నాన్సెన్స్‌.! నేనున్న పరిస్థితుల్లో ఇంకెవరైనా వుండి వుంటే, అక్కడ సీన్‌ మరోలా వుండేది. నేను చాలా సంయమనంతో వ్యవహరించాను. సోషల్‌ మీడియాలో మరీ హద్దులు దాటేస్తున్నవారిని ఉద్దేశించే కఠిన పదజాలం వాడాల్సి వచ్చింది. అయినా నేను చెప్పాలనుకున్న మాటలే చెప్పాను. ఇందులో తప్పేమీ లేదు, అశ్లీలం అసలే లేదు. జుగుప్స ఏదన్నా వుంటే, అది మీ కామెంట్స్‌లోనే..' అని ఆదా శర్మ క్లారిటీ ఇచ్చేసింది.