Advertisement


Home > Movies - Movie News
అజ్ఞాత‌వాసిని చూసేసిన వాళ్లు వెర్రోళ్లా..!

ఇప్పుడు కాదు.. ఇలాంటి యాడింగులు ఎప్పుడూ విమర్శలకు గురి అయ్యేవే. అప్పుడెప్పుడో చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ కు ఫస్ట్ వీక్ లో డివైడ్ టాక్ వచ్చే సరికి.. జెమిని వాళ్లు దానికి యాడింగు చేశారు. ఒక పాటను కంపోజ్ చేయించి, చిరంజీవి.. సోనాలీ బింద్రేల మీద ఆ పాటను చిత్రీకరించేసి.. రెండో వారం నుంచినో.. మూడో వారం నుంచినో దాన్ని యాడ్ చేశారు.

అయినప్పటికీ శంకర్ దాదా ఎంబీబీఎస్ జస్ట్ యావరేజ్ సినిమాగా మాత్రమే నిలిచింది. అప్పుడే విమర్శలు వచ్చాయి. అంటే అప్పటికే ఆ సినిమాను చూసిన వాళ్లు వెర్రోళ్లా? ఫస్ట్ వీక్ లో చూసిన వాళ్లకు అదనపు సీన్లను లేదా పాటను చూసే అర్హత లేనట్టా? అనే ప్రశ్నలు వినిపించాయి.

ఇప్పుడు అజ్ఞాత‌వాసి విషయంలో కూడా అదే జరుగుతోంది. కొత్త సీన్లు అంటున్నారు. వెంకటేష్ పేరుతో ప్రచారం చేసుకుంటున్నారు. మరి పవర్ స్టార్.. గా ఫేమస్ అయిన పవన్ కల్యాణ్ సినిమాకు ఆయన ఇమేజ్ చాలనట్టా? అదనంగా మరో హీరో కొసరు సీన్లలో నటించాడని చెప్పుకుని సినిమా వ్యాపారాన్ని చేసుకోవడమా ఇది? అయినా ఫస్ట్ త్రీడేస్ లో అజ్ఞాత‌వాసి సినిమాను చూసిన వాళ్లు వెర్రివాళ్లా?

ఇలాంటి సీన్లన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఈ సినిమాను చూడాల్సిందా? మరీ ఇంత చీప్ ట్రిక్స్ ఏంటి? ఎవరో అనామకులు, చోటా మోటా సినిమా మేకర్లు ఇలాంటి పనులు చేస్తే అదో స్టంటు. కానీ.. పేరుకు స్టార్ హీరో అయిన పవన్ కల్యాణ్ సినిమా విషయంలో ఇలా చేయడం అంటే.. జారిపోవడమే కదా? ఆఖరికి ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేసి.. సినిమాకు వసూళ్లను రాబట్టుకోవాల్సిన దౌర్భాగ్యపు స్థితిలోకి జారిపోవడం ఏమిటో మరి!!