Advertisement


Home > Movies - Movie News
పుకార్లకు చెక్ పెట్టిన అఖిల్

అఖిల్-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హలో సినిమాను డిసెంబర్ 22న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించాడు నిర్మాత నాగార్జున. అయితే నాగ్ ప్రకటించినప్పటికీ మరోవైపు ఈ సినిమా విడుదల సాధ్యం కాకపోవచ్చంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. 

రోజురోజుకు షూటింగ్ ఆలస్యం అవుతుండడమే దీనికి కారణం. ఎట్టకేలకు తన సినిమాకు సంబంధించి స్వయంగా అఖిల్ అప్ డేట్ ఇచ్చాడు. హలో సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రారంభమైనట్టు ట్వీట్ చేశాడు. అంతేకాదు.. నాగ్ చెప్పినట్టు డిసెంబర్ 22న వస్తున్నామని కూడా స్పష్టంచేశాడు. అలా "హలో" సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు అఖిల్. 

హలో సినిమాను అక్కినేని కాంపౌండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొదటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో, కనీసం సెకండ్ మూవీతోనైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు అఖిల్, నాగార్జున. అందుకే ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మిస్తున్నాడు నాగ్. ఒకప్పటి నటి లిజి కూతురు కల్యాణి, ఈ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమౌతోంది.