Home > Movies - Movie News
ఫుల్ యాక్టివ్ అయిన అఖిల్

మొన్నటివరకు ఇబ్బందికరమైన వార్తలతో హెడ్ లైన్స్ లో నిలిచాడు అక్కినేని అఖిల్. ఆ టైమ్ లో మీడియాకే కాదు, సోషల్ మీడియాకు కూడా దూరమైపోయాడు. మళ్లీ ఇన్ని రోజులకు ఈ యంగ్ హీరోలో హుషారు కనిపిస్తోంది. ప్రస్తుతం తన సినిమా వర్క్ తో బిజీగా ఉన్న అఖిల్, సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నాడు. 

ఐఫా అవార్డుల వేడుక నుంచి మళ్లీ వెలుగులోకి రావడం మొదలుపెట్టాడు అఖిల్. కాస్త కొత్తగా కనిపించేందుకు పాత ప్రొఫైల్ పిక్ మార్చేశాడు. ప్రస్తుతం తన మూవీ అప్ డేట్స్ తో పాటు తన వ్యక్తిగత విశేషాలతో ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా సంగతుల్ని ఎప్పటికప్పుడు తనే అప్ డేట్ చేస్తున్నాడు. అంతేకాదు.. తన సినిమాకు వర్క్ చేస్తున్న హాలీవుడ్ స్టంట్ మాస్టర్ బాబ్ బ్రౌన్ ను కూడా తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా పరిచయం చేశాడు.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు జున్ను, ఎక్కడ ఎక్కడ ఉందో తారక అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ 2 టైటిల్స్ ను రిజిస్టర్ చేసి పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న అఖిల్.. త్వరలోనే తన సినిమా ఫస్ట్ లుక్ తో కూడా హంగామా చేయబోతున్నాడు.