Advertisement


Home > Movies - Movie News
అఖిల్ ను చూస్తే జాకీచాన్ గుర్తుకొస్తాడట

ఈనెల 22న థియేటర్లలోకి రానున్న హలో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నాడు నాగ్. సినిమా మొత్తం రెడీ అయిపోయిందని, ఔట్ పుట్ బ్రహ్మాండంగా వచ్చిందని చెబుతున్నాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ పార్ట్ చాలా కొత్తగా ఉంటుందని, కొన్నిసార్లు సినిమాలో అఖిల్ ను చూస్తే జాకీచాన్ గుర్తొస్తాడని అంటున్నాడు. 

"హలో మూవీలో కొత్త రకమైన యాక్షన్ చూస్తారు. ఎలాగైనా కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో బాబ్ బ్రౌన్ అనే హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ను తీసుకొచ్చాం. టీజర్ లో మీరు చూసిన యాక్షన్ అదే. కేవలం యాక్షన్ పార్ట్ కే దాదాపు 30రోజులు కేటాయించాం. ఒక యాక్షన్ ఎపిసోడ్ అయితే కృష్ణానగర్ ఇళ్ల పైకప్పుల పైనే ఉంటుంది. రోడ్లు టచ్ అవ్వవు."

సినిమాలో యాక్షన్ సన్నివేశాలు పెద్దలతో పాటు చిన్నారులకు కూడా బాగా నచ్చుతాయంటున్నాడు నాగ్. మూవీలో ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని అఖిల్ స్వయంగా పెర్ఫార్మ్ చేశాడని, ఎలాంటి డూప్ వాడలేదని స్పష్టంచేశాడు. 

హలో సినిమానే అఖిల్ కు డెబ్యూ మూవీ అంటున్నాడు నాగార్జున. అఖిల్ ను తను ఎలా చూడాలనుకున్నాడో హలో సినిమా అలా ఉంటుందంటున్నాడు.