Advertisement


Home > Movies - Movie News
అఖిల్‌, నాగ్‌.. ఫన్నీ 'ఛీటింగ్‌'.!

అక్కినేని అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'హలో' సినిమాకి సంబంధించి ఓ పాట విడుదలైంది. దాదాపు నిమిషం పాటు నిడివి వున్న వీడియోలో, వెడ్డింగ్‌ సాంగ్‌ కన్పిస్తోంది. సాంగ్‌ని చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు. అఖిల్‌ షరామామూలుగానే మంచి డాన్స్‌ మూమెంట్స్‌తో ఈ సాంగ్‌కి హైలైట్‌గా నిలిచాడు. హీరోయిన్‌ కళ్యాణి ప్రియదర్శన్‌, అఖిల్‌ తల్లిదండ్రుల పాత్రల్లో నటిస్తోన్న రమ్యకృష్ణ, జగపతిబాబు ఈ పాటలో దర్శనమిచ్చారు. 

ఇక, ఈ సాంగ్‌ రిలీజ్‌కి ముందు కాస్తంత డ్రమెటిక్‌ హడావిడి జరిగింది. 'రేపు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నా..' అంటూ నిన్ననే అఖిల్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. దానికి నాగార్జున రిప్లయ్‌ ఇస్తూ, 'నాకు చెప్పకుండానా.? ఇదేనా ఆ సాంగ్‌..' అంటూ వీడియో సాంగ్‌కి సంబంధించిన వివరాల్ని వెల్లడించేశాడు. దాంతో అఖిల్‌, 'ఛీటింగ్‌..' అంటూ తండ్రి నాగార్జున పట్ల సరదాగానే కాస్తంత నొచ్చుకున్నట్లుగా సోషల్‌ మీడియాలో స్పందించాడు. 

మొత్తమ్మీద, పాట కంటే తండ్రీ - కొడుకుల మధ్య కన్వర్జేషన్‌కి అక్కినేని అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఆ మధ్య సమంత - నాగార్జున మధ్య కూడా ఈ తరహా సరదా 'ఛాటింగ్‌' వ్యవహారం సోషల్‌ మీడియాలో సందడి చేసిన విషయం విదితమే.