Home > Movies - Movie News
అన్ని సినిమాలు ఒకేసారి

సంక్రాంతి వెళ్లి ఇంకా రెండు నెలలు దాటిందంతే. అప్పుడే వచ్చే సంక్రాంతి మీద ఇప్పటి నుంచి గురి పెట్టేస్తున్నారు. గత ఏడాదికి నుంచి పెద్ద హీరోల సినిమాలు షెడ్యూల్ కావడంలో వచ్చిన లెక్కలు అన్న కలిసి ఇప్పుడు దాదాపు అందరు హీరోలు కావాలనుకుంటే తమ సినిమాలను సంక్రాంతికి తెచ్చేలా కుదిరింది.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా దీపావళికే రెడీ అయిపోతుంది. కాస్త దూరం జరిగితే సంక్రాంతి రెడీగా వుంటుంది. బన్నీ-వక్కంతం వంశీ సినిమా కూడా దీపావళికే రెడీ అయిపొతుంది. కావాలనుకుంటే మరో సినిమా చేసేందుకు సరిపడా గ్యాప్ దొరుకుతుంది. నాగ్ జూన్ నుంచి మరో సినిమా ప్రారంభిస్తారు. సో అది కూడా సంక్రాంతికి రెడీ చేసుకోవచ్చు.

ఇక మెగాస్టార్ట్ ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి టార్గెట్ సంక్రాంతినే. మహేష్-కొరటాల శివ సినిమా కూడా అంతే. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా తరువాత కనుక వెంటనే సినిమా స్టార్ట్ చేస్తే ఆ టైమ్ కే రెడీ అవుతుంది. ఇక అఖిల్-విక్రమ్ కుమార్ సినిమా వచ్చే నెల స్టార్ట్ అయినా, స్మూత్ గా, స్లోగా చెక్కుకుంటూ వెళ్తే సంక్రాంతి వేళకే సిద్ధం అవుతుంది.

అయితే అన్ని సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగవు కానీ, సంక్రాంతి వేళకు దాదాపు ఒకరిద్దరు మినహా అందరు పెద్ద హీరోల సినిమాలు రెడీగా వుంటాయి. గత ఏడాదిలో ఇదే హీరొల ప్రాజెక్టులు స్టార్ట్ కావడంలో చాలా లేట్ అయింది. అందువల్ల అన్నీ ఒకేసారి ఇంచుమించుగా స్టార్ట్ అయి, ఒకేసారి రెడీ అవుతున్నాయి.