Home > Movies - Movie News
అప్పుడు కాలకేయ.. ఇప్పుడు సుబ్బరాజు

బాహుబలి సినిమా ప్రభాకర్ కు ఎంత గుర్తింపు తెచ్చిందో అందరికీ తెలిసిందే. ఇతడ్ని ఇప్పుడంతా కాలకేయ అనే పిలుస్తున్నారు. చాలా సినిమాల టైటిల్స్ లో కూడా కాలకేయ ప్రభాకర్ అనే వేస్తున్నారు. ఆ పాత్ర ఈ నటుడికి అంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. మరి బాహుబలి-2లో అలాంటి అదృష్టం ఎవరికి దక్కనుంది. అంతా సుబ్బరాజు వైపే వేలు చూపిస్తున్నారు. అవును.. బాహుబలి ది కంక్లూజన్ సినిమాలో సుబ్బరాజుకు అదిరిపోయే క్యారెక్టర్ ఇచ్చాడట దర్శకుడు రాజమౌళి.

బాహుబలి - ది బిగినింగ్ లో పాత్రల పరిచయం, ఎలివేషన్ తోనే సరిపోయిందని, పార్ట్-2లో మాత్రం ఆ పాత్రల మధ్య సంఘర్షణ కనిపిస్తుందని రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. కాలకేయ లాంటి నెగెటివ్ క్యారెక్టర్స్ వల్ల ఆ పాత్రలు మరింతగా ఎలివేట్ అయ్యాయి. అందుకే పార్ట్-2లో కూడా అలాంటి ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రను సృష్టించాడట జక్కన్న. ఆ పాత్రను సుబ్బరాజు పోషించినట్టు తెలుస్తోంది. 

బాహుబలి-2 ట్రయిలర్ ను లాంచ్ చేసినప్పుడు ప్రభాస్, రానాతో పాటు సుబ్బరాజు కూడా స్టేజ్ పై కనిపించగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, మొన్నటివరకు పార్ట్-2లో సుబ్బరాజు ఉన్నాడనే విషయం చాలామందికి తెలీదు. అలాంటి నటుడు ఏకంగా ట్రయిలర్ లాంచ్ లో కనిపించేసరికి కచ్చితంగా, బాహుబలి - ది కంక్లూజన్ సినిమాలో సుబ్బరాజుకు కీలకమైన పాత్రే దక్కి ఉంటుందని అంతా మాట్లాడుకుంటున్నారు.