Home > Movies - Movie News
అరరె 'బిగ్‌బాస్‌' అయిపోతోందే.!

మొదట్లో బోర్‌ బోర్‌గా స్టార్ట్‌ అయిన 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో, ఆ తర్వాత వేగం పుంజుకుంది. అంతా జూనియర్‌ ఎన్టీఆర్‌ చలవే. వీకెండ్స్‌లో హోస్ట్‌గా ఎన్టీఆర్‌ చూపించే జోష్‌, బుల్లితెర వీక్షకులకి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌నిస్తే, హౌస్‌మేట్స్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అలా క్రమక్రమంగా వీకెండ్స్‌తో పోటీ పడలేకపోయినా, 'వీక్‌నెస్‌'ని అయితే అధిగమించింది బిగ్‌బాస్‌ సాధారణ రోజుల్లోనూ.! 

రోజులు గడిచాయి.. వారాలూ గడిచిపోయాయి.. ఇప్పుడు ముగింపు దశకు వచ్చేసింది. ఈ వీకెండ్‌ కాదు, వచ్చే వీకెండ్‌ 'బిగ్‌బాస్‌' ముగిసిపోనుంది. ఇప్పుడు వీక్‌ డేస్‌, వీకెండ్స్‌ అన్న తేడాల్లేవ్‌.. అన్ని రోజుల్లోనూ సేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బిగ్‌బాస్‌ నుంచి బుల్లితెర వీక్షకులకు లభిస్తోంది. సిల్లీగా అన్పించినా, ఫన్నీ టాస్క్‌లు బుల్లితెర వీక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. ఆ టాస్క్‌లకు మించి, హౌస్‌మేట్స్‌ మధ్య కెమిస్ట్రీ బుల్లితెర వీక్షకుల్ని ఓ రేంజ్‌లో అలరించేస్తోంది. 

ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌.. ఇలా ఒకటేంటి.? బిగ్‌బాస్‌ హౌస్‌లో చాలా చాలానే కన్పిస్తున్నాయిప్పుడు. మొత్తంగా చూస్తే, ఇప్పుడు 'బిగ్‌బాస్‌' ఓ కంప్లీట్‌ షో. ఇలా, కంప్లీట్‌ షో అన్పించుకున్నాక, షో ముగింపుకొచ్చేస్తోందంటే ఒకింత బాధగా వుండడం సహజమే. కానీ, ఇంతకు మించిన ఉత్సాహంతో రెండో సీజన్‌ని నడిపేందుకు నిర్వాహకులకు ఈ రెస్పాన్స్‌ బోల్డంత బూస్టప్‌ ఇస్తుందన్నది నిర్వివాదాంశం. 

బిగ్‌బాస్‌ హౌస్‌కి సంబంధించి ఏ హౌస్‌మేట్‌ విజేత అవుతారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, అంతిమంగా బిగ్‌ బాస్‌ షో, బుల్లితెరపై విజేత అన్పించుకోవడం విశేషమే. ఇందులో ఫుల్‌ క్రెడిట్‌ హోస్ట్‌ ఎన్టీఆర్‌కే ఇచ్చేయాలి. వెండితెరపై ఎన్టీఆర్‌ నటవిశ్వరూపం సంగతేమోగానీ, బుల్లితెరపై మాత్రం ఆ నటవిశ్వరూపాన్ని చూపించేశాడు. హోస్ట్‌గా తొలి బుల్లితెర షోనే సూపర్‌ సక్సెస్‌ చేసిన ఎన్టీఆర్‌కి హేట్సాఫ్‌ చెప్పి తీరాల్సిందే.