Advertisement


Home > Movies - Movie News
'అర్జున్‌రెడ్డి' క్రేజ్‌ ఆ రేంజ్‌లో వుంది మరి.!

హీరోయిన్లు - షోరూంల ప్రారంభజోత్సవాలూ మామూలే. ఈ క్రమంలో ఒక్కోసారి అభిమానుల 'అతి' కారణంగా హీరోయిన్లు నానా రకాల ఇబ్బందులకు గురవడమూ చూస్తూనే వున్నాం. తాజాగా, 'అర్జున్‌రెడ్డి' ఫేం షాలిని పాండే, అభిమానుల తాకిడిని తట్టుకోలేకపోయింది. 'అర్జున్‌ రెడ్డి' సాధించిన విజయంతో షాలిని పాండేకి ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో పెరిగిన విషయం విదితమే. 

నెల్లూరులో ఓ షోరూం ప్రారంభోత్సవానికి షాలిని హాజరయ్యింది. అయితే, అక్కడామె స్వల్ప అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అభిమానుల నుంచి ఇబ్బందికర పరిస్థితులొస్తాయని భావించిన నిర్వాహకులు, షాలిని పాండే సన్నిహితులు, ఆమె ఫేస్‌ కన్పించకుండా వుండేందుకు, పూర్తిగా కవర్‌ చేసేశారు.. అదీ డెడ్‌బాడీ తరహాలో. స్ట్రెచర్‌ మీద ఆమెనలా తరలిస్తోంటే అంతా షాక్‌కి గురయ్యారు. 

ఆసుపత్రి వర్గాల సూచన మేరకే అలా చేయాల్సి వచ్చిందనీ, చిన్నపాటి జ్వరం మినహా షాలిని పాండే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని అటు నిర్వాహకులు, ఇటు ఆమె సన్నిహితులు ఆ తర్వాత అసలు విషయాన్ని బయటపెట్టారు.