Home > Movies - Movie News
బాహుబలికి గూగుల్ కలరింగ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాహుబలి-2 సినిమా ట్రయిలర్ కు గూగుల్ ఇండియా తనదైన స్టయిల్ లో కలరింగ్ ఇచ్చింది. ట్రయిలర్ రిలీజైన రోజున వరల్డ్ వైడ్ ట్రెండింగ్స్ లో బాహుబలి-2 కూడా నిలవడంతో... ఆ హంగామాను గూగల్ ఇండియా సెలబ్రేట్ చేసింది.

ఈవారం వరల్డ్ వైడ్ ట్రెండింగ్స్ లో బాహుబలి-2, ఐన్ స్టీన్, హోలీ ముందువరుసలో నిలిచాయి. ఈ మూడింటికీ ముడిపెడుతూ గూగుల్ సంస్థ ఓ చిన్న గ్రాఫిక్ వీడియోను, మరో పోస్టర్ ను తయారుచేసింది. సంకెళ్లతో నిలబడిన ప్రభాస్ ను ఐన్ స్టీన్ గెటప్ లోకి తీసుకొచ్చింది. ఐన్ స్టీన్ కనిబెట్టిన ఫార్ములాను కూడా యాడ్ చేసింది. ఈ మొత్తాన్ని హోలీ రంగులతో నింపేసింది. ఇలా బాహుబలికి తనదైన స్టయిల్ లో మేకోవర్ ఇచ్చింది గూగుల్.

విడుదలై ఇన్ని రోజులు అయినప్పటికీ బాహుబలి-2 ట్రయిలర్ హంగామా ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు వేలల్లో ఈ ట్రయిలర్ కు వ్యూస్ పెరుగుతున్నాయి. ఈ వీకెండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్నారు. వచ్చేనెల 28న బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానుంది.