Advertisement


Home > Movies - Movie News
బాహుబలి-2 : ఇది సిసలైన చరిత్ర

వెయ్యి కోట్ల గ్రాస్ సాధిస్తే ఔరా అనుకున్నాం. అలా అనుకుంటూ ఉంటుండగానే అప్పుడే బాహుబలి-2 సినిమా 1500 కోట్ల గ్రాస్ సాధించింది. అవును.. బాహుబలి-2 సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.

ఏ భారతీయ సినిమాకూ దక్కని అరుదైన గౌరవం ఇది. మొన్నటివరకు కలలో కూడా ఊహించని ఈ ఫిగర్ ను బాహుబలి – ది కంక్లూజన్ సినిమా అందుకోవడంతో ట్రేడ్ పండిట్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. నిజమే ఓ తెలుగు సినిమాకు ఇన్ని వసూళ్లు రావడం నిజంగా ఆశ్చర్యమే మరి.

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 వసూళ్లు ఇలా ఉన్నాయి. (21 రోజుల్లో)

ఇండియా
నెట్ – 953 కోట్లు
గ్రాస్ – 1227 కోట్లు
ఓవర్సీస్
గ్రాస్ - 275 కోట్లు
మొత్తం – 1502 కోట్లు

మొన్నటివరకు నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి మాత్రమే అత్యధిక వసూళ్లు రాగా.. తాజాగా ఆగ్నేయాసియా దేశాలు కూడా బాహుబలి-2కు మరిన్ని కలెక్షన్లు అందిస్తున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్ లాంటి దేశాల్లో కూడా బాహుబలి-2 సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తున్నాయి.