Home > Movies - Movie News
భళా భళ్లాలదేవా: రాజమౌళికి నచ్చేశాడు

ఏదన్నా కొత్త సినిమా రిలీజ్‌ అయితే.. అది తనకు నచ్చితే.. ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రస్తావించి, ఆ సినిమాకి తనవంతుగా 'ఫ్రీ పబ్లిసిటీ' చెయ్యడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. చిన్న సినిమాల్ని రాజమౌళి అలా ప్రోత్సహిస్తున్న తీరు ముచ్చటేస్తుంటుంది. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనాసరే.. రాజమౌళి, తన నోటీస్‌కి వస్తే చాలు.. వాటి పబ్లిసిటీ కోసం తనవంతుగా సహకరిస్తుంటాడు. 

అలాంటిది, తాను భళ్ళాలదేవుడిగా మార్చిన రానా హీరోగా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడకుండా వుంటాడా.? 'భళా భళ్లాలదేవా..' అంటూ సోషల్‌ మీడియాలో, రానా కొత్త సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' గురించి పాజిటివ్‌ కామెంట్స్‌ చేశాడు. సినిమా తనకు బాగా నచ్చిందనీ, అందులో రెండు సీన్స్‌ చాలా చాలా బాగా నచ్చాయని రాజమౌళి చెప్పుకొచ్చాడు. 

కాజల్‌, కేథరీన్‌ పాత్రలూ బాగున్నాయని చెబుతూ, దర్శకుడు తేజ సినిమాని తెరకెక్కించిన తీరు బాగుందని కితాబిచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి.