Advertisement


Home > Movies - Movie News
భళా రాజమౌళీ.. పోటెత్తిన సోషల్‌ మీడియా.!

సోషల్‌ మీడియా పోటెత్తింది.. 'హ్యాపీ బర్త్‌ డే రాజమౌళి' అంటూ సోషల్‌ మీడియాని రాజమౌళి అభిమానులు తమ అభిమానంతో ముంచెత్తేశారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న తేడాల్లేవ్‌.. మొత్తంగా భారతీయ సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌ డే విషెస్‌ అందించడం మామూలు విషయమే అయినా, ఆ విషెస్‌లో 'బాహుబలి' రాజమౌళిని ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రస్తావిస్తూ తమ ప్రత్యేకతను చాటుకోవడం విశేషం కాక మరేమిటి.? 

'బాహుబలి-2' సాధించిన విజయంతో బాలీవుడ్‌ సినీ జనం 'సరికొత్త ఇండియన్‌ సూపర్‌ స్టార్‌' అంటూ రాజమౌళిని అభినందించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? సినిమాకి దర్శకత్వం వహించడమొక్కటే కాదు, సినిమా మార్కెటింగ్‌ విషయమై రాజమౌళి చూపించిన శ్రద్ధ, సినిమా రీచ్‌ పెంచడానికి ఆయన చేసిన కృషి.. ఇలా 'బాహుబలి'కి అంతా తానే అయి వ్యవహరించాడాయన. 

ఎంత ఎదిగినా ఒదిగే వుండడం రాజమౌళి ప్రత్యేకత. అదే, అతన్ని సూపర్‌ స్టార్‌ని చేసేశాయి. ఇప్పటిదాకా ఏ దర్శకుడికీ లభించని ప్రత్యేకమైన గుర్తింపు 'ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ డైరెక్టర్‌' రాజమౌళికి దక్కడమంటే చిన్న విషయం కాదు. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌.. ఇలా ఒకటేమిటి, ఎక్కడ చూసినా రాజమౌళి పుట్టినరోజు శుభాకాంక్షలతో కూడిన విషయాలే. దటీజ్‌ రాజమౌళి.!