Home > Movies - Movie News
బికినీలు బాబోయ్‌ బికినీలు

ఒకదాన్ని మించి ఇంకో బికినీతో 'బేవాచ్‌' బ్యూటీ ప్రియాంకా చోప్రా గ్లామర్‌ని ఎడా పెడా ఆరబోసేస్తోంది. ప్రియాంకకి బికినీ కొత్త కాదు.. బికినీకి ఆమె కూడా కొత్త కాదు. అయినాసరే, ప్రియాంకా చోప్రా 'బేవాచ్‌' సినిమాలో నటిస్తోందంటే, ఆ సినిమాలో ఆమె బికినీలో ఎలా కన్పించబోతుందోనన్న ఉత్కంఠ నెలకొనడం సహజమే. 

సినిమాలో సంగతెలా వున్నా, 'బేవాచ్‌' పార్టీల్లో ప్రియాంకా చోప్రా బికినీలతో రెచ్చిపోతోంది. 'బేవాచ్‌' టీమ్‌ సముద్ర స్నానాల్లో మునిగి తేలుతోంటే, ఆ 'ఎంజాయ్‌మెంట్‌'కి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాకెక్కేస్తున్నాయి. కొన్ని ప్రియాంకా చోప్రా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ నుంచి బయటకొస్తోంటే, ఇంకొన్ని ఫొటోలు వేరే వేరే మార్గాల్లో వెలుగు చూస్తుండడం గమనార్హం. 

ఇక, కొన్ని బికినీ స్టిల్స్‌లో ప్రియాంక చోప్రా ఆల్ట్రా స్టైలిష్‌గా కన్పిస్తోంటే, ఇంకొన్ని స్టిల్స్‌లో మాత్రం, బికినీ గ్లామర్ హద్దులు దాటేసిందనీ అన్పిస్తోంది. ఎన్ని హద్దులు దాటేసినాసరే, బికినీ స్టిల్స్‌ చూస్తే ఎవరైనాసరే ప్రియాంక బికినీ గ్లామర్ కి ఫిదా అవ్వాల్సిందే. మొత్తమ్మీద, ప్రియాంక బికినీ స్టిల్స్ తో కావాల్సినంత పబ్లిసిటీ పొందుతోందన్నమాట.