Advertisement


Home > Movies - Movie News
బోల్డ్‌ టాక్‌: ఆదా శర్మకి ఏమయ్యింది.?

'హార్ట్‌ ఎటాక్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ఆదా శర్మ, తెలుగులో చెప్పుకోదగ్గ విజయాలేమీ అందుకోలేదు. 'క్షణం', 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి' సినిమాల్లో కన్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తమిళంలో ప్రభుదేవా సరసన ఓ సినిమాలో నటిస్తోన్న ఆదా శర్మకి సోషల్‌ మీడియాలో 'యాక్టివ్‌'గా వుండడమంటే అదో సరదా. ఎప్పటికప్పుడు తన హాట్‌ హాట్‌ ఫొటోస్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, కుర్రకారుకి 'కిర్రాకు' పుట్టిస్తుంటుంది. 

ఆల్‌ ఆఫ్‌ షడెన్‌.. ఆదా శర్మకి కోపమొచ్చేసింది. చాలా బోల్డ్‌గా మాట్లాడేసింది. సినిమాల్లో పాత్రలు వేరు, రియల్‌ లైఫ్‌లో తన క్యారెక్టర్‌ వేరంటూ క్లాస్‌ తీసుకుంది. ఎవరైనా అబ్బాయి, తన దగ్గరకు వచ్చి 'ముద్దు పెట్టు' అనడిగితే, తన చేతిలో చావు దెబ్బలు తినాల్సి వస్తుందని హెచ్చరించింది. 'జనరేటర్‌ బద్దలైపోతుంది..' (కాస్త మాస్‌గా, పచ్చిగా.. అదేనండీ బోల్డ్‌ టాక్‌ చేసేసింది) అంటూ విరుచుకుపడిపోయింది ఆదా శర్మ. 

'కమాండో-2', 'హార్ట్‌ ఎటాక్‌' సినిమాల్లో అలా ఎందుకు నటించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చుకుంది. భావనారెడ్డి (కమాండో-2), హయాతి (హార్ట్‌ ఎటాక్‌) పాత్రల్ని చూసి, తనతో ఎవరైనా పెట్టుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఆదా శర్మ. ఇంతలా తానెప్పుడూ వార్నింగ్‌ ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదనీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా స్పందించాల్సి వచ్చిందని ఆదా శర్మ పేర్కొనడం గమనార్హం. ఇంతకీ, అంతలా ఆదా శర్మని కెలికిందెవరబ్బా.?