Home > Movies - Movie News
బూతు, భయం తప్ప ఏముంది కొత్తగా.?

వెండితెరపై బూతు సినిమాలతో హోరెత్తించింది సరిపోక, వెబ్‌ సిరీస్‌ షురూ చేసిన బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌, 'రాగిణి ఎంఎంఎస్‌ రిటర్న్స్‌' పేరుతో ఓ బూతు వెబ్‌ సిరీస్‌ని తీసుకొస్తోన్న విషయం విదితమే. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తోనే సినిమాలో ఏముంటుందో చెప్పకనే చెప్పేశారు. టీజర్‌లోనూ కొత్తదనం ఏమీ లేదు, బూతు తప్ప. ట్రైలర్‌ ఇంకేముంటుంది కొత్తదనం.! 

ఒకింత భయం.. డోస్‌ మించిన అడల్ట్‌ కంటెంట్‌.. ఇదే వుంది 'రాగిణి ఎంఎంఎస్‌ రిటర్న్స్‌'లో. 'అడల్ట్‌ కంటెంట్‌'ని ఎలా అమ్ముకోవాలో బహుశా ఏక్తా కపూర్‌కి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో.! అఫ్‌కోర్స్‌, 'ఆన్‌ స్క్రీన్‌ సెక్స్‌'ని క్యాష్‌ చేసుకోవడానికి చాలామంది బాలీవుడ్‌లో వున్నారు.. వారిలో ఏక్తా కపూర్‌ ఇంకాస్త స్పెషల్‌ అంతే. 

ఓ మహిళ ఈ తరహా కంటెంట్‌ని అమ్ముకోవడమేంటి.? అన్న విమర్శలున్నాసరే, 'నేను చేస్తున్నది వ్యాపారం.. సమాజ సేవ కాదు.. సినిమా అయినా, ఇంకోటైనా.. అది ప్రేక్షకుల్ని అలరించేందుకే.. ప్రేక్షకులకు నచ్చకపోతే ఏదీ విజయం సాధించదు..' అని చాలా సందర్భాల్లో చెప్పిన ఏక్తాకపూర్‌.. ఇప్పుడూ అదే చెబుతోంది. అఫ్‌కోర్స్‌, చెప్పడానికి ఆమె దగ్గర ఇంకో సమాధానం వుండదనుకోండి.. అది వేరే విషయం.