Advertisement


Home > Movies - Movie News
బన్నీ ఖాతాలో మరో బ్రాండ్

ఘాటుగా, ఎర్రగా, తాజాగా అంటూ టీవీల్లో నిత్యం పలకరించే అల్లు అర్జున్.. ఇకపై మ్యాంగో ఫ్రూటీ అంటూ పాడబోతున్నాడు. అవును.. పార్లేకి చెందిన ఫ్రూటీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నాడు బన్నీ. ఈ మేరకు సదరు సంస్థకు, బన్నీకి మధ్య కాంట్రాక్ట్ కుదిరింది. తాజా ఒప్పందం ప్రకారం.. ఫ్రూటీ యాడ్, హోర్డింగ్స్ లో కనిపించడంతో పాటు.. దీనికి సంబంధించిన పలు ప్రచారం కార్యక్రమాల్లో "ఫేస్ ఆఫ్ ది బ్రాండ్" గా కనిపించబోతున్నాడు బన్నీ.

దక్షిణాసియా శీతల పానీయాల విభాగంలో పార్లేకి మంచి పట్టుంది. ఫ్రూటీ, యాపీ, ఫిజ్, బెయిలీ, ఫ్రీయో లాంటి బ్రాండ్స్ అన్నీ ఈ కంపెనీవే. ఇక దక్షిణ భారతదేశం విషయానికొస్తే.. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కేరళ, కర్ణాటకలో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అల్లు అర్జున్ ను తమ ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఎంచుకుంది పార్లే. బన్నీ రాకతో తమ మార్కెట్ విలువ 2022 నాటికి 10వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఒక ప్రకటనలో పార్లే తెలిపింది.

ఇప్పటికే బన్నీ చేతిలో కోల్ గేట్, రెడ్ బస్, ఓఎల్ఎక్స్, లాట్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ లాంటి బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడీ హీరో ఖాతాలోకి ఫ్రూటీ కూడా వచ్చి చేరింది. పార్లే, బన్నీ మధ్య ఎన్ని కోట్ల రూపాయలకు ఈ ఒప్పందం కుదిరిందో తెలియాల్సి ఉంది. త్వరలోనే ఫ్రూటీ యాడ్ షూటింగ్ లో పాల్గొంటాడు బన్నీ.