Home > Movies - Movie News
సెన్సార్ టాక్: సీరత్ హాట్ సీన్స్ పై కత్తెర

సీరత్ కపూర్ అందాల్ని ఇన్నాళ్లూ కంప్యూటర్ తెరలు, మొబైల్ స్క్రీన్స్ పై మాత్రమే చూశాం. తన హాట్ హాట్ పోజులతో సోషల్ మీడియాను వేడెక్కించిన ఈ భామ.. సిల్వర్ స్క్రీన్ పై కూడా అదే రేంజ్ లో రెచ్చిపోయింది. రాజుగారి గది-2లో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది సీరత్. కాకపోతే ఆ అందాల్ని ఆస్వాదించే ఛాన్స్ మాత్రం ఆడియన్స్ కు లేదు. సీరత్ రెచ్చిపోయి చూపించినా సెన్సార్ అధికారులు మాత్రం చాలా సన్నివేశాల్ని తొలిగించినట్టు తెలుస్తోంది.

రాజుగారి గది-2లో ఫస్టాఫ్ మొత్తం సీరత్ కపూర్ కనిపిస్తుంది. ఈ విషయాన్ని దర్శకుడు ఓంకార్ నిర్థారించాడు. ఆమె చాలా గ్లామరస్ గా కనిపిస్తుందని, సీరత్ అందాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని కూడా చెప్పుకొచ్చాడు.

అది నిజమే. సెన్సార్ కంటే ముందే సినిమాను చూసిన కొంతమంది జనాలు ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ థియేటర్లలోకి వచ్చే ప్రింట్ లో మాత్రం సీరత్ హాట్ నెస్ కనిపించదు. ఈ మేరకు కొన్ని సన్నివేశాల్ని తొలిగించడంతో పాటు, మరికొన్ని బికినీ సీన్స్ కు బ్లర్ ఎఫెక్టులు సూచించిందట సెన్సార్ బోర్డ్.

ఇదే విషయంపై సీరత్ ను ప్రశ్నించింది మీడియా. దీనిపై రియాక్ట్ అయిన ఈ బ్యూటీ, ఎక్స్ పోజింగ్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కంటెంట్ డిమాండ్ చేస్తే బికినీతో సినిమా అంతా కనిపిస్తానని చెప్పుకొచ్చింది. పాపం.. ఎక్స్ పోజింగ్ విషయంలో సీరత్ ఎంత ఫాస్ట్ గా ఉందో సెన్సారోళ్లు కూడా అంతే ఫాస్ట్ గా ఉన్నారు.