Home > Movies - Movie News
చార్టర్ ఫ్లయిట్ లో బన్నీ

చార్టర్ ఫ్లయిట్ ఎక్కేస్తున్నాడు బన్నీ. ఎందుకోసమో కాదు, ఇప్పటికే మాగ్జిమమ్ హైప్ వచ్చిన దువ్వాడ జగన్నాధమ్ కు మరింత ప్రచారం కల్పించడం కోసం. అందుకోసం ఈ నెల 21న ఓ టూరు పోగ్రామ్ పెట్టకున్నాడు. 21న బయల్లేరి విజయవాడ వెళ్లి, అక్కడి మీడియాతో, అలాగే లిమిటెడ్ ఫ్యాన్స్ తో కాస్సేపు ఇంటరాక్ట్ అవుతాడు.

అక్కడి నుంచి తిరుపతి, ఆ పైన వీలయితే విశాఖ వెళ్లి ఇదే విధంగా మీడియాతో ఫ్యాన్స్ తో కాస్సేపు గడిపి సాయంత్రానికి తిరిగి వస్తాడు. ఈ లోగా 19న హైదరాబాద్ లో ప్రింట్ మీడియాను కలిసి ముచ్చటిస్తాడట. 20న విజువల్ మీడియాను మీట్ అవుతాడు.

బన్నీ తో పాటు ఈ జర్నీలో నిర్మాత దిల్ రాజు, డైరక్టర్ హరీష్ శంకర్ కూడా పాల్గొంటారు. దువ్వాడ జగన్నాధమ్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసకుని ఈ నెల 23న విడుదల కు సిద్ధమవుతోంది.