Home > Movies - Movie News
కంగ్రాట్స్‌ కోడలా.. 'అక్కినేని' ఆనందం

మొన్నీమధ్యనే యంగ్‌ హీరో రామ్‌, సమంతని ఉద్దేశించి 'థాంక్యూ సమంత అక్కినేనిగారూ..' అంటూ సంబోదించిన విషయం విదితమే. అక్కినేని నాగచైతన్యను పెళ్ళాడనుంది గనుక, సమంత రూత్‌ ప్రభు కాస్తా సమంత అక్కినేనిగా మారనుంది. ఆ విషయాన్నే రామ్‌ పేర్కొన్నాడు. అయితే, ఇంకా నాగచైతన్య, సమంత పెళ్ళి చేసుకోలేదు.. ఎంగేజ్‌మెంట్‌ మాత్రమే అయ్యింది. అయినాసరే, అక్కినేని నాగార్జున ఎప్పుడో సమంతని మనస్ఫూర్తిగా కోడలిగా.. కాదు కాదు, అంతకంటే ఎక్కువగా 'అమ్మ'గా ఫిక్సయిపోయారు.! 

తాజాగా, నాగార్జున మరోమారు సమంతపై తనకున్న అమితమైన ప్రేమను చాటుకున్నారు. 'కంగ్రాట్స్‌ కోడలా..' అంటూ సమంతని అభినందించారు నాగార్జున. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాకి సంబంధించి మామా కోడళ్ళ మధ్య 'టెక్స్‌టింగ్‌' జరిగింది. అదేనండీ, ఫోన్‌లో ఛాటింగ్‌. ఆ ఛాటింగ్‌ జరిగిన వైనాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు నాగార్జున. 'కంగ్రాట్స్‌ కోడలా..' అని నాగార్జున పేర్కొంటే, 'లవ్‌ మామా' అని సమంత క్యూట్‌ క్యూట్‌గా మెసేజ్‌ చేసింది. 

'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలో అక్కినేని నాగచైతన్య చాలా బాగున్నాడనీ, 'ఎవ్విరిథింగ్‌ వర్క్స్‌' అనీ సమంత చెప్పుకొచ్చింది. 'ఐయామ్‌ సో హ్యాపీ.. థాంక్యూ..' అంటూ ముగించింది సమంత. కాబోయే భర్త సినిమాకి ఈ స్థాయిలో సమంత ప్రమోట్‌ చేయడం ఆసక్తికరమే. సినిమా ప్రమోషన్‌ కన్నా ఎక్కువగా అక్కినేనివారి 'ఆనందం' ఇక్కడ స్పష్టంగా కన్పిస్తోంది.