Advertisement


Home > Movies - Movie News
ఒక్క చైనాలోనే 500 కోట్లు

రికార్డులు సృష్టించడం అమీర్ కు కొత్త కాదు. ఇండియాలో సరికొత్త రికార్డులు సృష్టించిన హీరో ఇతడు. ఇప్పుడీ హీరో పొరుగుదేశం చైనాలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. అమీర్ నటించిన దంగల్, చైనాలో బీభత్సంగా ఆడేస్తోంది. రోజురోజుకు ఈ సినిమా చైనా బాక్సాఫీస్ లో స్ట్రాంగ్ అవుతోంది. తాజాగా చైనాలో ఈ సినిమా వసూళ్లు 500 కోట్ల రూపాయలకు చేరాయి. కేవలం 13 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇది.

వీకెండ్, రెగ్యులర్ డేస్ అనే తేడాలేకుండా దంగల్ మూవీకి చైనాలో వసూళ్లు వస్తున్నాయి. రోజువారీ కలెక్షన్లు చూస్తే.. సోమవారం ఈ సినిమాకు 5 మిలియన్ డాలర్లు వచ్చాయి. సాధారణంగా స్థానికంగా రిలీజ్ అయ్యే సినిమాలకు వీకెండ్స్ లో కూడా ఇంత ఎమౌంట్ రాదు.

ఇక మంగళవారం 4.7, బుధవారం 4.20, గురువారం 3.73 మిలియన్ డాలర్లు వసూలు చేసింది దంగల్ సినిమా. గురువారం రన్ తో ఈ మూవీ 500 కోట్లు కలెక్ట్ చేసింది.

ప్రస్తుతం వరల్డ్ వైడ్ కలెక్షన్లలో బాహుబలి-2కు పోటీ ఇస్తున్న సినిమా దంగల్ మాత్రమే. ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1230 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. చైనాలో మరో 10 రోజులు ఇదే ఊపు కొనసాగిస్తే, దంగల్ సినిమా కూడా 1500 కోట్ల క్లబ్ లోకి చేరుతుంది.