Advertisement


Home > Movies - Movie News
ఫ్యాన్స్ పైత్యం.. మా హీరోతో పెట్టుకుంటే మీ సెక్స్‌క్లిప్సే!

సినీ అభిమానం వెర్రితలలు వేస్తోంది.. హీరోలు చేసింది ఎంత నీఛమైన పని అయినా, హీరోల రూపంలోని వారు ఎంత రాక్షసులు అయినా.. అభిమానులు మాత్రం వాళ్లు తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ హీరోలు ఏం చేసినా రైటు, ఆఖరికి అత్యంత దుర్మార్గానికి ఒడిగట్టినా అది సబబే, ఇకపై ఎవరైనా మా హీరోకి అడ్డుగా వస్తే.. వాళ్ల విషయంలో కూడా అంతే రాక్షసంగా వ్యవహరిస్తాం.. జాగ్రత్త అని సినీహీరోల అభిమానులు రెచ్చిపోతున్నారు.

మలయాళ స్టార్ హీరో దిలీప్ అభిమానులు ఇలాంటి పనులతో ఇప్పుడు వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఒక నటిపై దాడి చేయించి, ఆమెను రేప్ చేయించి, వీడియోలు తీసి.. ఆమెపై ప్రతీకారం తీర్చుకొన్నాడు అనేది దిలీప్ పై నమోదైన అభియోగం. అందుకు సంబంధించి పోలీసులు సాక్ష్యాలు కూడా సంపాదించి.. మూడు నెలల పాటు దిలీప్ ను జైల్లో పెట్టారు. కేసు ఇంకా విచారణలో ఉంది. అయితే దిలీప్ బెయిల్ సంపాదించి బయటకు వచ్చాడు.

మరి ఈ వ్యవహారం ఎటుపోతుందో తెలీదు కానీ.. దిలీప్ ఫ్యాన్స్ మాత్రం హద్దు మీరుతున్నారు. చివరకు ఎంత వరకూ వచ్చారంటే, తమ అభిమాన హీరోతో ఎవరైనా పెట్టుకుంటే వాళ్ల సెక్స్ క్లిప్స్ అందరి మొబైల్స్ లోకి వస్తాయి జాగ్రత్త.. అని హెచ్చరించేటంతటి వరకూ వచ్చారు వీళ్లు. ఈ మేరకు దిలీప్ అభిమానుల ఫ్యాన్స్ పేజీల్లో ఇలాంటి పోస్టులు దర్శనం ఇచ్చాయి. దిలీప్ కు వ్యతిరేకంగా, నటికి మద్దతుగా ఉన్న వాళ్లందరికీ అభిమానులు ఈ హెచ్చరిక జారీ చేశారు.

తేడా వస్తే.. ఆ నటికి పట్టిన గతే మీకూ పడుతుంది, మీ సెక్స్ క్లిప్స్ కూడా ఇంటర్నెట్ లోకి వస్తాయని.. వీళ్లు నటికి మద్దతుగా నిలుస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. అభిమానుల ఆగడాలు మరీ హద్దుమీరుతున్నాయి. సినీ అభిమాన పైత్యంలో కొట్టుకుపోతూ వీళ్లు ఇలా వ్యవహరిస్తున్నారు. దిలీప్ ఫ్యాన్స్ పెట్టిన ఈ పోస్టులపై కేరళలో నిరసన వ్యక్తం అవుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం దేన్నీ లెక్కచేసేటట్టుగా లేరు. మొత్తానికి సినిమా హీరోల అభిమానులు క్రమక్రమంగా వింతపశువులుగా మారుతున్నట్టుగా ఉన్నారు.