Home > Movies - Movie News
చైతూ, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ డౌటే!

నాగచైతన్య, సమంత పెళ్లి అయిపోయింది. అందరూ హైదరాబాద్ కూడా తిరిగొచ్చేశారు. పెళ్లయి దాదాపు వారం రోజులు అవుతోంది. ఇప్పటివరకు రిసెప్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు నాగార్జున. పెళ్లి వాళ్లకు నచ్చినట్టు చేసుకున్నారు, రిసెప్షన్ మాత్రం నాకు నచ్చినట్టు జరుగుతుందని గతంలో ప్రకటించిన నాగార్జున.. ఆ తేదీని మాత్రం చెప్పడం లేదు.

"రిసెప్షన్ పై ఇంకా క్లారిటీ రాలేదు. రిసెప్షన్ కోసం సమంత, నాగచైతన్య డేట్స్ అడుగుతున్నాను. వాళ్లు ఎప్పుడు చెబితే అప్పుడు. కాకపోతే ఇంత తొందరగా ఎందుకని నాకు కూడా అనిపిస్తోంది. ఇప్పుడే కదా పెళ్లయింది. కొన్నాళ్లు వాళ్లను ఎంజాయ్ చేయనీయండి." రిసెప్షన్ పై నాగార్జున వెర్షన్ ఇది.

చూస్తుంటే.. వెడ్డింగ్ రిసెప్షన్ ను నాగార్జునే కావాలని వాయిదా వేస్తున్నట్టు కనిపిస్తోంది. లేకపోతే చైతూ-సమంత ఎంజాయ్ మెంట్ కు ఒక రోజు సాయంత్రం జరిగే రిసెప్షన్ కు సంబంధం ఏముంది చెప్పండి. ఇదే విషయం గట్టిగా అడిగితే అందరం హైదరాబాద్ లోనే ఉన్నాం కదా.. తొందర్లోనే పెట్టుకుందామంటూ వెళ్లిపోయాడు నాగ్. 

నాగచైతన్య-సమంత పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించలేదు. కేవలం కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య మాత్రమే పెళ్లి జరిగింది. సమంత, చైతూ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం హాజరయ్యారు. రిసెప్షన్ కు అందర్నీ ఆహ్వానించాలనేది నాగ్ ఆలోచన. కానీ అదెప్పుడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.