Home > Movies - Movie News
డ్రగ్స్‌.. తప్పేగానీ, తప్పలేదు.!

బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌ ఒకప్పుడు డ్రగ్స్‌కి ఎడిక్ట్‌. డ్రగ్స్‌కి బానిసగా మారి, కెరీర్‌ని నాశనం చేసుకున్నాడు. ఆ డ్రగ్స్‌ పుణ్యమా అని మాఫియాతో లింకులేర్పడ్డాయి. అవి కాస్తా టెర్రరిస్టులకు అనుకూలంగా మారాయి. ఫలితం, 'టాడా' చట్టం కింద బుక్కయి, జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. సంజయ్‌ దత్‌ జీవితం ఎవరికైనా గుణపాఠమేనని ఇంకెవరో కాదు, స్వయంగా సంజయ్‌దత్‌ చెప్పుకున్నాడు కూడా. డ్రగ్స్‌ జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తాయని సంజయ్‌దత్‌ చెబుతుండేవాడు.

ఇక, సంజయ్‌దత్‌ బయోపిక్ లో సంజయ్ దత్ పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌కి సైతం చిన్నప్పుడు డ్రగ్స్‌ అలవాటేనట. స్కూల్‌ డేస్‌లోనే రణ్‌బీర్‌కపూర్‌ డ్రగ్స్‌కి అలవాటుపడ్డాడట. అయితే, ఆ తర్వాత అది తప్పని తెలుసుకున్నాడట. అంతేనా, సినీ నటుడిగా మారాక కూడా డ్రగ్స్‌ తీసుకోవాల్సి వచ్చిందట. ఈసారి మాత్రం, సినిమా కోసమేనంటున్నాడు రణ్‌బీర్‌కపూర్‌. 'రాక్‌స్టార్‌' సినిమా కోసం డ్రగ్స్‌ తీసుకోవాల్సి వచ్చిందని పెద్ద బాంబు పేల్చాడీ యంగ్‌ హీరో.

తన తాజా చిత్రం 'జగ్గాజాసూస్‌' ప్రమోషన్స్‌లో భాగంగా రణ్‌బీర్‌కపూర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. మరోపక్క, డ్రగ్స్‌ గురించి రణ్‌బీర్‌కపూర్‌ పనిగట్టుకుని మాట్లాడటం అందర్నీ విస్మయానికి గురిచేసింది. సినిమా కోసం డ్రగ్స్‌ తీసుకోవాల్సిన అవసరమేంటి.? ఆ విషయాన్ని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరమేంటని పలువురు విమర్శిస్తున్నారు.

అయితే, సినిమా కోసం ఒక్కోసారి రిస్క్‌ చేయాల్సి వుంటుందనీ, 'రాక్‌స్టార్‌' సినిమా కోసం తక్కువ మోతాదులో, తక్కువ తీవ్రతగల డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల అనుకున్న సన్నివేశం అనుకున్నట్లుగా వచ్చిందని రణ్‌బీర్‌కపూర్‌ చెబుతున్నాడు. 

తెలుగు సినీ రంగంలో డ్రగ్స్‌ ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ, ఓ బాలీవుడ్‌ హీరో తనకు డ్రగ్స్‌ ఒకప్పుడు అలవాటేనని చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.