Advertisement


Home > Movies - Movie News
ఏంటిది? కళ్యాణ్ రామ్? కొత్తగా

హీరో కళ్యాణ్ రామ్ తన కెరీర్ ప్రారంభం నుంచీ తనే సినిమాలు నిర్మిస్తూ, వైవిధ్యమైన సబ్జెక్ట్ లు తీసుకుంటూ వచ్చాడు. వాటిల్లో ఎక్కువగా సీరియస్ రోల్స్ నే చేసాడు. ఉన్నట్లుండి ట్రాక్ మార్చి ఫన్ పండించి పటాస్ చేసాడు. ఫలితం ఎలా వున్నా పూరిజగన్నాధ్ తో ఇజం చేసాడు.

ఇలా సీరియస్ ట్రాక్ నుంచి బయటకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఏకంగా రూట్ ను మార్చి బాగా వెనక్కు వెళ్లిపోయాడు. యంగ్ న్యూ కమర్ మాదిరిగా లవ్ అండ్ రొమాంటిక్ లైన్లో కి వచ్చినట్లు కనిపిస్తోంది. నానువ్వే అంటూ మాంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అందిస్తున్నట్లు విడుదల చేసిన చిన్న విడియో బైట్ క్లియర్ చేసింది.

యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మించే సినిమాకు 'నా నువ్వే' అనే మాంచి ఫీల్ లవ్ టైటిల్ పెట్టారు. సినిమాటోగ్రాఫర్లకు ద్రోణాచార్యుడు లాంటి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. తమన్నా కథనాయిక.

ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ మాగ్జిమమ్ యూత్ ఫుల్ గా మారిపోయే ప్రయత్నం చేసాడు. కాస్త క్లీన్ షేవ్, కళ్లజోడుతో డిఫరెంట్ గా వున్నాడు. వేలాది పుస్తకాల మధ్య కళ్యాణ్ రామ్ సీన్ చూస్తే జయేంద్ర-పిసి శ్రీరామ్ ల టేస్ట్ తెలిసిపోతుంది. లవ్ 100 ఎఫ్ఎమ్ ఆర్జే గా తమన్నా. మరి ఈ ప్రేమ కథేంటో, ఎలా వుంటుందో కానీ, టైటిల్ ప్రకటన మాత్రం సినిమా మీద ఆసక్తి రేకత్తించింది.

అమెరికాలో అజ్ఞాతవాసిని భారీగా విడుదల చేస్తూ తొలిసారి సినిమా రంగంలోకి వచ్చిన ఎల్ ఎ తెలుగు సంస్థ ఈ సినిమా ను నిర్మిస్తోంది. విజయ్ వట్టి కూటి,కిరణ్ ముప్పవరపునిర్మాతలు.