Home > Movies - Movie News
ఫీల్ మిస్ అవ్వకూడదు.. అందుకే చెర్రీ అలా...!

సుకుమార్ సినిమా కోసం చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాడు రామ్ చరణ్. కేవలం మేకోవర్ విషయంలోనే కాకుండా.. క్యారెక్టర్ అర్థంచేసుకోవడానికి, ఎమోషన్ ను క్యారీ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఫీల్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు చెర్రీ. సుకుమార్ సినిమాను ఏకథాటిగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడట.
 
ఏప్రిల్ నుంచి వెస్ట్ గోదావరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమా సెట్స్ పైకి వచ్చిన రోజు నుంచి 35 రోజుల పాటు నాన్-స్టాప్ గా షూటింగ్ చేయాలని చరణ్ నిర్ణయించుకున్నాడు. ఇలా చేయడం వల్ల క్యారెక్టర్ లో ఎమోషన్స్ మిస్ కావనేది చరణ్ ఫీలింగ్.

సుకుమార్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా టిపికల్ గా ఉంటుంది. ఈ దర్శకుడి స్క్రీన్ ప్లే కూడా లాజికల్ గా ఉంటుంది. ఇలాంటి డైరక్టర్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా విషయం మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే డైరక్టర్ తో పాటు క్యారెక్టర్ తో కూడా ప్రయాణించాలనే ఉద్దేశంతో చరణ్ ఇలా నాన్-స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేశాడట.