Home > Movies - Movie News
​'​అన్నపూర్ణ​' ​లో అగ్నిప్రమాదం

నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కినేని కుటుంబం ప్రతిష్టాత్మకంగా భావించే "మనం సెట్" లోనే ఈ అగ్నిప్రమాదం జరిగింది.

మనం సినిమా కోసం వేసిన ఈ సెట్ లో ఎన్నో సినిమాలు, మరెన్నో సీరియల్స్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. సెట్ తో పాటు ప్రస్తుతం షూటింగ్ కోసం ఉంచిన సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైనట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. 

అగ్నిప్రమాదానికి కారణం మాత్రం తెలియరాలేదు. మనం సెట్ ను నాగార్జున సెంటిమెంట్ గా ఫీలవుతారు. ఏఎన్నార్ ఆఖరి సినిమా షూటింగ్ అక్కడే జరగడం, ఆయన తన కెరీర్ ఆఖరి క్షణాల్ని అక్కడే గడపడంతో.. ఆ సెట్ ను వెరీ వెరీ స్పెషల్ గా ఫీల్ అవుతారు నాగ్.

అలాంటి సెట్ లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరం. నిన్ననే అక్కినేని కుటుంబం మొత్తం సమంత-నాగచైతన్యల వెడ్డింగ్ రిసెప్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇంతలోనే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.