Advertisement


Home > Movies - Movie News
ఫస్ట్‌ లుక్స్‌: రావణుడిగా ఎన్టీఆర్‌.!

జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా 'జై లవ కుశ' సినిమా ఫస్ట్‌ లుక్స్‌ విడుదలయ్యాయి. వీటిల్లో ఎన్టీఆర్‌ సరికొత్త మీసకట్టుతో కనిపిస్తున్నాడు. 'దమ్ము' సినిమాలోని మీసకట్టుకి, కాస్త గడ్డం టచ్‌ ఇచ్చి ఈ లుక్‌ని తీర్చిదిద్దినట్లు కన్పిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో రావణుడి బొమ్మ కన్పిస్తోంది గనుక, ఇది ఈ సినిమాలోని నెగెటివ్‌ క్యారెక్టర్‌ అనుకోవాలి. 

నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా, బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ముచ్చటగా మూడు పాత్రల్లో కనిపిస్తాడు. అందులో ఒకటి నెగెటివ్‌ షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌. కాదు, అదే సినిమాలోని విలన్‌ పాత్ర.. అన్న ప్రచారమూ జరుగుతోందనుకోండి.. అది వేరే విషయం. 

మొత్తమ్మీద, ఎన్టీఆర్‌ పుట్టినరోజునాడు, ఆయన అభిమానులకు 'ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌' సూపర్బ్‌ గిఫ్ట్‌ ఇచ్చిందనే అనుకోవాలి. స్టైలిష్‌గా ఎన్టీఆర్‌ లుక్‌ని డిజైన్‌ చేయడంతోపాటుగా, పోస్టర్స్‌ని కూడా మాస్‌ అప్పీల్‌ చూపిస్తూనే, స్టైలిష్‌గా డిజైన్‌ చేయడం గమనార్హం.