Advertisement


Home > Movies - Movie News
ముందు నాగచైతన్య.. తర్వాతే సూర్య

అఖిల్ తో హలో సినిమా చేసిన విక్రమ్ కుమార్.. తన నెక్ట్స్ మూవీని కూడా అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే చేయబోతున్నాడు. నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేస్తానని, ప్రస్తుతం దాని స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ప్రకటించాడు విక్రమ్ కుమార్.

విక్రమ్ కుమార్-నాగచైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని, హలో మూవీ ప్రమోషన్ టైమ్ లోనే నాగార్జున ప్రకటించాడు. అలా విక్రమ్ కుమార్ ను అందరి సమక్షంలో లాక్ చేశాడు. అయితే అప్పటికే సూర్యతో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు విక్రమ్ కుమార్. అది కంప్లీట్ చేసిన తర్వాత నాగచైతన్యతో మూవీ ఉంటుందని అంతా భావించారు.

కానీ సూర్య ప్రస్తుతం ఖాళీగా లేడు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు. అది కంప్లీట్ అవ్వడానికి కనీసం 4నెలలు పడుతుందట. అందుకే ఈ గ్యాప్ లో నాగచైతన్యతో సినిమా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు విక్రమ్ కుమార్. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలిపాడు.

ప్రస్తుతం సవ్యసాచి సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. అటు ఆర్జీవీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాగార్జున. వీళ్లిద్దరూ ఫ్రీ అయిన వెంటనే అన్నపూర్ణ స్టుడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ బ్యానర్లపై విక్రమ్ కుమార్-నాగచైతన్య కాంబినేషన్ లో నాగ్ నిర్మాతగా సినిమా ఉంటుంది.