Home > Movies - Movie News
గౌతమ్ నందకు అదొక్కటే రక్ష

మొన్నటివరకు గౌతమ్ నంద సినిమాకు ఏదైతే ప్లస్ పాయింట్ అనుకున్నామో అదే పాయింట్ ను ఎలివేట్ చేస్తూ విడుదలైంది గోపీచంద్ సినిమా ట్రయిలర్. ఈ ట్రయిలర్ ఔట్ అండ్ ఔట్ స్టయిలిష్ అండ్ రిచ్ లుక్ తో కనిపించింది.

ఇది ఎంతలా ఎట్రాక్ట్ చేసిందంటే.. సినిమాలో హీరో ఎవరు, కథేంటి అనే విషయాల్ని పక్కనపెట్టి.. ఈ రిచ్ విజువల్స్ కోసమైనా ఓసారి గౌతమ్ నందాను చూసేయొచ్చు అనే కోరికను ఇనిస్టెంట్ గా రగిల్చింది.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. ఇప్పటికే విడుదలైన టీజర్ కు కొనసాగింపుగా ఉంది ట్రయిలర్. టీజర్ లో చూపించిన భారీతనం ట్రయిలర్ లో మరింత ఎక్కువగా కనిపించింది. వీటికి తోడు హీరోయిన్లు హన్సిక, క్యాథరీన్ అందాల్ని కూడా చూపించడంతో గౌతమ్ నంద టీజర్ కిక్ ఇచ్చింది.

అలా అని టీజర్ అమాంతం బాగుందని చెప్పలేం. తమన్ బ్యాక్ గ్రౌడ్ స్కోర్ ఇంకాస్త బాగుంటే బాగుండేది. గోపీచంద్ లాంటి హీరోకు, సంపత్ నంది లాంటి దర్శకుడికి ఇంత భారీ సినిమా ఇవ్వాలని అనిపించిన నిర్మాతలు భగవాన్, పుల్లారావును మాత్రం కచ్చితంగా అభినందించి తీరాలి. ఈనెల 28న విడుదలకానున్న గౌతమ్ నంద బాక్సాఫీస్ వద్ద ఆ భారీతనం చూపిస్తుందో లేదో చూడాలి.