Home > Movies - Movie News
హ్యాపీనెస్‌ అదొక్కటే: ఇషా గుప్తా

'ప్రేమించడం.. ప్రేమించబడటం.. ఒకే ఒక్క హ్యాపీనెస్‌ ఇదే..' అంటూ సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఇషా గుప్తా ఓ మాంఛి మెసేజ్‌ దంచేసింది. ఎందుకో తెలుసా.? ఇంకెందుకు, సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ, ఓ ఫొటోని షేర్‌ చేయడం, అది కాస్తా వైరల్‌గా మారి, ట్రాలింగ్‌కి ఆస్కారమివ్వడంతోనే. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతున్న ఫొటో ఇషా షేర్‌ చేయడంతో, చాలామందికి ఒళ్ళు మండిపోయింది. 

'ఇదో పబ్లిసిటీ స్టంట్‌..' అంటూ నెటిజన్లు ట్రాలింగ్‌ షురూ చేసేశారు. ఇషాకి సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేయడం భలే సరదా. సెమీ న్యూడ్‌ ఫొటోల్ని సైతం షేర్‌ చేస్తూ, అభిమానుల్ని ఉర్రూతలూగించేస్తుంటుంది. అలాంటి ఇషా నుంచి, హాస్పిటల్‌లో బెడ్‌ మీద నుంచి ఫొటో షేర్‌ చేస్తే, ఒక్కసారిగా అభిమానులు హర్టయిపోరూ.! అదే జరిగింది. హర్ట్‌ అవడం, ట్రాలింగ్‌ షురూ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. 

దానికి వివరణ ఇస్తూ, ఇదిగో పైన చెప్పుకున్న విధంగా 'వేదాంతం'తో కూడిన డైలాగ్‌ పేల్చింది ఇషా గుప్తా. బాధ కలిగినా, ఆనందమొచ్చినా.. అది అభిమానులతోనే పంచుకుంటానంటూ ఇషా గుప్తా క్లారిటీ ఇచ్చిందండోయ్‌. అయినా, బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఇలాంటి హాస్పిటల్‌ ఫొటోలు కొత్త కాదు, ఆ ఫొటోల కారణంగా వివాదాల కొత్త కాదు. వారికి అదో 'తుత్తి'.!