Advertisement


Home > Movies - Movie News
హెబ్బాతో నాకు సంబంధం లేదు.. మరో హీరో ప్రకటన

రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ ప్రేమించుకుంటున్నారంటూ మొన్నటివరకు పుకార్లు వచ్చాయి. అయితే అలాంటిదేం లేదని తాజాగా ఈ హీరోహీరోయిన్లు ప్రకటించారు. 

రాజ్ కు తనకు మధ్య ఉన్నది వృత్తిగత సంబంధం మాత్రమేనని హెబ్బా ప్రకటిస్తే.. ఆన్ స్క్రీన్ హెబ్బాతో కెమిస్ట్రీ అంటే తనకు చాలా ఇష్టమని మరో 30 సినిమాలైనా చేస్తానని రాజ్ తరుణ్ ప్రకటించాడు. ఇప్పుడీ హీరోతో పాటు మరో హీరో కూడా హెబ్బాతో తనకెలాంటి సంబంధం లేదంటున్నాడు.

హెబ్బా-రాజ్ తరుణ్ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని తెలిసిన వెంటనే.. దానికి కారణం నాగ్ అన్వేష్ అంటూ వార్తలు వచ్చాయి. నాగ్ అన్వేష్ కు హెబ్బా చాలా క్లోజ్ అయిందని, అందుకే హెబ్బా-రాజ్ తరుణ్ మధ్య బంధం తెగిపోయిందంటూ రూమర్లు వచ్చాయి. వీటిని నాగ్ అన్వేష్ కొట్టిపారేస్తున్నాడు.

హెబ్బాతో ఏంజెల్ అనే సినిమా చేసిన ఈ హీరో, సెట్స్ వరకు మాత్రమే హెబ్బా తనకు క్లోజ్ అంటున్నాడు. రాజ్ తరుణ్-హెబ్బా మధ్య ఏం జరిగిందో తనకు తెలీదని, తను మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ హెబ్బాను బెస్ట్ ఫ్రెండ్ గానే చూస్తానంటున్నాడు. మొత్తానికి ఒకే సీజన్ లో రెండు బ్రేకప్స్ అన్నమాట.