Home > Movies - Movie News
హలో.. ఇంతకీ ఆ సర్ ప్రైజ్ ఏంటి?

“రేపు మరో చిన్న సర్ ప్రైజ్ కు సిద్ధంగా ఉండండి.“ ఈ ఒక్క ట్వీట్ మాత్రమే చేశాడు అఖిల్. ఈ చిన్న ట్వీట్ చుట్టూ ఇప్పుడు చాలా తతంగం నడుస్తోంది. ఆ సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా జరుగుతోంది. ఈ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమౌతున్న కల్యాణి లుక్ ను విడుదల చేస్తారని కొందరంటుంటే.. మరికొందరు మాత్రం ఏకంగా టీజర్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.

హలో సినిమాకు సంబంధించి టీజర్ ఇప్పటికే రెడీ అయింది. ఈ టీజర్ లో నాగార్జున వాయిస్ ఓవర్ కూడా ఉంది. కాకపోతే దీన్నే రేపు విడుదల చేస్తారా లేక సాంగ్ బిట్ లాంటిది ఏమైనా వదులుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

అఖిల్ హీరోగా నటిస్తున్న హలో సినిమాకు పోటీగా నాని నటిస్తున్న ఎంసీఏ కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి సంబంధించి తాజాగా టీజర్ విడుదల చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 'హలో' యూనిట్ కూడా టీజర్ నే విడుదల చేసే అవకాశాలున్నాయంటున్నారు ఎక్కువమంది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోందట. డిసెంబర్ 22న హలో సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.