Home > Movies - Movie News
నాకు ప్రేమంటే అసహ్యం

సాధారణంగా హీరోయిన్లను ప్రేమ గురించి అడిగితే ముడుచుకుపోతారు. అదొక అందమైన ఫీలింగ్ అంటారు. తమ కలల రాకుమారుడు ఇంకా తారసపడలేదంటూ ముసిముసిగా నవ్వుతూ స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. కానీ పవన్ హీరోయిన్ నికీషా పటేల్ మాత్రం పూర్తి రివర్స్. అసలు తనకు ప్రేమ వాసనే పడదంటోంది ఈ భామ.

"నా జీవితంలో ఎలాంటి ప్రేమల్లేవ్. ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రేమలో పడను. అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అలాఅని ఎఫైర్లు పెట్టుకోవడం నాకు బొత్తిగా ఇష్టం ఉండదు. అసలు నన్ను ప్రేమలో పడేసేంత మగాడు నాకింకా ఎదురుపడలేదు." లవ్ గురించి అడిగితే నికీషా ఆన్సర్ ఇది.

ప్రేమించి పెళ్లి చేసుకుంటాననే కాన్సెప్ట్ కు తను పూర్తిగా దూరమంటోంది నికీషా. మరోవైపు బ్లయిండ్ డేట్ లాంటివి తనకు అస్సలు పడవంటోంది. ఇన్ని విషయాలు చెప్పిన ఈ బ్యూటీ.. ఇంట్లో చూసిన సంబంధమే చేసుకుంటానని, పెద్దలు కుదిర్చిన పెళ్లి తనకు ఇష్టమనే విషయాన్ని మాత్రం సూటిగా చెప్పలేకపోయింది.