Home > Movies - Movie News
ఇంకోస్సారి: పవన్‌కళ్యాణ్‌ పుత్రోత్సాహం.!

పవన్‌కళ్యాణ్‌ మళ్ళీ తండ్రి అయ్యాడు. తాజాగా మరో వారసుడొచ్చాడు పవన్‌కళ్యాణ్‌కి. పవన్‌కళ్యాణ్‌ సతీమణి అన్నా లెజ్‌నెవా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన పుత్రరత్నాన్ని చూసుకుని పవన్‌ మురిసిపోతున్న ఫొటో చూస్తున్నారు కదా.! హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో అన్నా లెజ్‌నెవా ఈ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. 

ఇక, పవన్‌కళ్యాణ్‌, రేణుదేశాయ్‌తో ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన విషయం విదితమే. అఖిరానందన్‌, ఆద్య పవన్‌కళ్యాణ్‌కి మొదటి, రెండవ సంతానం. రేణుదేశాయ్‌తో విడాకులు తీసుకుని, అన్నా లెజ్‌నెవాని పెళ్ళాడాడు పవన్‌. పవన్‌ - అన్నా లెజ్‌నెవాలకు పుట్టిన మొదటి సంతానం ఓ అమ్మాయి. ఆమె పేరు పోలిన్‌. ఇప్పుడు వీరిద్దరికీ మగబిడ్డ పుట్టాడు. మొత్తంగా చూస్తే, పవన్‌కళ్యాణ్‌కి ఇది నాలుగో సంతానంగా చెప్పుకోవాలేమో.! 

ఇదిలా వుంటే, పవన్‌కళ్యాణ్‌ కొత్త సినిమా 2018 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్టు, పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌, బుల్లితెరపై సందడి చేస్తోన్న సంగతి తెల్సిందే కదా.!