Home > Movies - Movie News
'జై లవకుశ'-2 : ఈసారి ఇంకా పకడ్బందీగా

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న 'జై లవ కుశ' సినిమా ఇంకా విడుదల కానే లేదు, కొత్తగా ఈ 'జై లవకుశ' - 2 ఏంటనేదే కదా మీ డౌట్‌.! ఇది, 'జై లవ కుశ' కొత్త టీజర్‌. వినాయక చవితికి ఈ టీజర్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'జై' పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చిన విషయం విదితమే. 'జై' పాత్రని రావణుడితో పోల్చుతూ ఆ టీజర్‌ రూపొందింది. 'జై లవ కుశ' సినిమాలోని 'జై' పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌తో వుంటుంది. అదీ రావణుడి స్థాయిలో.! 

ఇక, 'లవ కుశ' పాత్రలెలా వుంటాయి.? 'లవకుమార్‌' పాత్రకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ స్టిల్‌ అయితే ఇప్పటికే రిలీజ్‌ అయ్యింది. కూల్‌ అండ్‌ కామ్‌గా, స్టైలిష్‌ గెటప్‌లో కన్పిస్తోందది. ఆ పాత్ర తాలూకు ఇంట్రడక్షన్‌ రెండో రూపంలో విడుదల కానుంది. మొదటి టీజర్‌ విడుదలకు ముందు లీక్‌ అవడంతో, నిర్మాత కళ్యాణ్‌రామ్‌ పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చిన విషయం విదితమే. అందుకే, రెండో టీజర్‌ విడుదల విషయంలో చాలా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 

అన్నట్టు, 'జై' పాత్రకి ధీటుగా 'లవ' పాత్ర వుంటుందట. యాక్షన్‌తో, బీభత్సమైన డైలాగ్స్‌తో 'జై' పాత్రని పరిచయం చేస్తే, లవకుమార్‌ పాత్రని డాన్స్‌ మూమెంట్స్‌తో పరిచయం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 'జై లవ కుశ' సినిమాలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తోన్న విషయం విదితమే. ఇంతకీ మూడో పాత్ర 'కుశ' ఎలా వుంటుందట.? ఏమో వేచి చూడాల్సిందే.