Advertisement


Home > Movies - Movie News
జై లవకుశ ఫస్ట్ కాపీ రెడీ

ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో నటిస్తున్న జై లవకుశ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. సినిమా 2గంటల 35నిమిషాలు వచ్చింది. ఇదే కాపీని యథాతథంగా సెన్సార్ కు పంపించాలని నిర్ణయించారు. ఈనెల 14న (ఎల్లుండి) జై లవకుశ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. దసరా కానుకగా ఈనెల 21న జై లవకుశ సినిమా థియేటర్లలోకి రానుంది.

మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తయింది. టేబుల్ ప్రాఫిట్ తో నిర్మాత కల్యాణ్ రామ్ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. మరోవైపు సినిమా ప్రమోషన్ కు సంబంధించి కొత్త ప్లాన్స్ తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజర్లు, ట్రయిలర్, సాంగ్స్ విడుదల అవ్వడంతో.. ఇకపై సాంగ్ బిట్స్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. 

హీరోయిన్లతో పాటు తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ ఇందులో ఉంది. రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఆ స్పెషల్ సాంగ్ బిట్ ను కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో యూనిట్ ఉంది. మరోవైపు ఓవర్సీస్ లో ఈనెల 20కే జై లవకుశ ప్రీమియర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా ప్రీమియర్స్ ఉండవు.