Home > Movies - Movie News
కైఫ్‌తో ఖాన్‌ కెమిస్ట్రీ.. ఆ కిక్కే వేరప్పా!

సల్మాన్‌ఖాన్‌ ఏ విషయాన్నయినా ఓపెన్‌గానే చెప్పేస్తాడు. ఓ సందర్భంలో 'నిన్ను నేను ఖాన్‌ని చేద్దామనుకున్నా.. కానీ నువ్వు కపూర్‌ అవుదామనుకున్నావ్‌..' అని డైరెక్ట్‌గా కత్రినాకైఫ్‌తోనే చెప్పేశాడు సల్మాన్‌ఖాన్‌ తన మనసులోని మాటని. ఒకప్పుడు సల్మాన్‌ఖాన్‌, కత్రినాకైఫ్‌ మధ్య ఆన్‌ స్క్రీన్‌ మాత్రమే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ బీభత్సమైన కెమిస్ట్రీ నడిచింది. కొన్ని కారణాలతో అది బెడిసి కొట్టేసింది. ఆ తర్వాత రణ్‌బీర్‌కపూర్‌తో ప్రేమలో పడింది కత్రినాకైఫ్‌. 

ఏమయ్యిందో.. మళ్ళీ ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌తో, కత్రినాకైఫ్‌ 'ప్యాచప్‌' అయ్యేలా వుంది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు 'టైగర్‌ జిందా హై' సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో సల్మాన్‌ఖాన్‌తో క్లోజ్‌గా వున్న ఓ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది కత్రినాకైఫ్‌. ఇంకేముంది, ఇద్దరి మధ్యా మళ్ళీ ఏదో 'కెమిస్ట్రీ' స్టార్ట్‌ అయ్యిందన్న గుసగుసలు షురూ అయ్యాయి. 

ఈ మధ్యనే ఓ సందర్భంలో సల్మాన్‌ఖాన్‌, కత్రినాకైఫ్‌ గురించి మాట్లాడుతూ, 'చాలామంది హీరోయిన్లతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ పండించినా.. కత్రినాకైఫ్‌తో రొమాన్స్‌ మాత్రం వెరీ వెరీ స్పెషల్‌..' అంటూ చెప్పుకొచ్చాడు. ఏమో, ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ వర్కవుట్‌ అయి, సల్మాన్‌ఖాన్‌ ఆశించినట్లు కత్రినాకైఫ్‌ కాస్తా కత్రినా ఖాన్‌ అయ్యేందుకు మార్గం సుగమం అవుతుందేమో వేచి చూడాలి.