Advertisement


Home > Movies - Movie News
కంగన అలా.. హృతిక్‌ మాత్రమే ఎందుకిలా.?

కంగనా రనౌత్‌ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతోంది.. హృతిక్‌ రోషన్‌కీ, తనకీ మధ్య ఎఫైర్‌ నడిచిందని. అనూహ్యంగా హృతిక్‌ తన నుంచి దూరంగా జరిగిపోయాడనీ, అతను చాలా సున్నిత మనస్కుడనీ, ఒక మాట మీద నిలబడే తెగువ అతనికి లేదనీ.. ఇలా ఒకటేమిటి, కంగన - హృతిక్‌ మీద చాలా చాలా ఆరోపణలు చేసేసింది. 

నిజానికి, కంగనా రనౌత్‌ పేరు గాసిప్స్‌ కాలమ్స్‌లోకి ఎక్కడం కొత్తేమీ కాదు. సినిమా రంగంలో తన ఎఫైర్ల గురించి బాహాటంగా చెప్పుకోవడమూ ఆమెకు కొత్త కాదు. హృతిక్‌ విషయంలోనూ కంగన అలాంటి సంచలనాల కోసమే పాకులాడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నా, ఓ దశలో హృతిక్‌ - కంగనా కలిసి పార్టీల్లో కన్పించడం వంటివన్నీ ఈ ఇద్దరి మధ్యా ఎఫైర్‌కి మరింత బలాన్నిచ్చాయి. 

అయితే, హృతిక్‌ మాత్రం చాలా అరుదుగా మాత్రమే తాను కంగనాని కలిసి వుండొచ్చనీ, ఆమెతో ఎఫైర్‌ అన్న మాటల్లో అర్థమే లేదని అంటున్నాడు. సినిమా పరంగా ఒకటి రెండుసార్లు తామిద్దరం కలిశామన్నది హృతిక్‌ వాదన. ఈ మొత్తం వ్యవహారంలో కంగన, చాలా కాన్ఫిడెంట్‌గా హృతిక్‌ మీద విమర్శలు చేసేస్తోంది. హృతిక్‌ మాత్రం వాటికి సమాధానం చెప్పుకోలేక నానా తంటాలూ పడ్తున్నాడు. 

సుజానే ఖాన్‌తో వైవాహిక బంధం తెగిపోయాక, హృతిక్‌ మానసికంగా కుంగిపోయిన మాట వాస్తవం. అక్కడినుంచే కంగన వేధింపులు, హృతిక్‌కి ఎక్కువయ్యాయన్నది హృతిక్‌ సన్నిహితుల వాదన. అయితే, సుజానేతో బంధం తెగిపోతున్న సమయంలో మానసికంగా బలహీనమైపోయిన హృతిక్‌కి అండదండగా నిలిచింది తానేనని కంగన చెబుతోంది. కొన్నాళ్ళపాటు ఈ వ్యవహారంపై మౌనం దాల్చిన హృతిక్‌, ఇప్పుడు ఓపెన్‌ అయిపోతున్నాడు. హృతిక్‌ ఎంతగా ఓపెన్‌ అవుతున్నా, కంగన తెగువ ముందు హృతిక్‌ వివరణలు సరిపోవడంలేదు. చాలా చిత్రమైన సందర్భమిది.