Advertisement


Home > Movies - Movie News
కళ్లముందే స్లిమ్ అయిపోయింది

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాస్త లావెక్కింది కరీనా కపూర్. ఇది సహజం. పోస్ట్-ప్రెగ్నెన్సీ తర్వాత ఎవరికైనా ఎదురయ్యే అనుభవమే. అయితే ఆ స్టేజ్ నుంచి ఎంత తొందరగా బయటపడ్డామనేది ఇంపార్టెంట్. అలా కరీనాకపూర్ కళ్లముందే స్లిమ్ అయింది. డిసెంబర్ లో బాబు పుడితే ఏప్రిల్ నాటికి స్లిమ్ అయింది.

మొన్నటి వరకు కాస్త బొద్దుగా, పెద్ద బుగ్గలతో కనిపించింది కరీనా. బాబు తైమూర్ తోనే ఎక్కువగా గడిపింది. ఆమె తన బరువును తగ్గించుకొని, మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని అంతా అనుకున్నారు. కానీ కరీనా మాత్రం ఎక్కువ టైం తీసుకోలేదు. జస్ట్ 5 నెలల్లోనే మళ్లీ తన పాత ఫిజిక్ ను సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజులుగా కెమెరాకు కనిపించలేదు కరీనా. తాజాగా జిమ్ నుంచి బయటకొస్తున్న టైమ్ లో కొందరు క్లిక్ మనిపించారు. ఆ ఫొటోల్లో కరీనా కాస్త నాజూగ్గా కనిపించింది.

మనిషి సన్నబడినప్పటికీ బెబోలో అప్పటి మెరుపు మాత్రం తగ్గింది. ఆ విషయాన్ని పక్కనపెడితే రికార్డు టైంలో కరీనా ఇలా తగ్గడానికి ఓ కారణం ఉంది. త్వరలోనే ఆమె శశాంకా ఘోష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోంది. దీంతోపాటు ఏకంగా 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తో మరో ఆఫర్ కూడా ఆమెను వరించింది. ఈ ప్రాజెక్టుల కోసమే ఆమె రికార్డ్ టైమ్ లో బరువు తగ్గింది.