Advertisement


Home > Movies - Movie News
'కర్ణ'కు అడ్డంకులు

పాపం, టైటిల్ బాగుంది, మన సినిమాకు పెట్టేసుకుందాం అనుకున్నారు బాలయ్య బాబు 102వ సినిమా యూనిట్ జనాలు. జయసింహా, లక్ష్మీ నరసింహా రెడ్డి అనే టైటిళ్ల కన్నా కర్ణ టైటిల్ సూపర్ గా అనిపించి అలా అనుకున్నారు.

కానీ అక్కడే టైటిల్ అడ్డం తిరిగింది. టైటిల్ రెడీగా అవైలబుల్ నో కాదో చూసుకోలేదు. తీరా చేస్తే, వీళ్ల మనసులో మాట అవతలి వారికి ఎలా తెలిసిందో, ఎవరో కొద్ది రోజుల క్రితమే కర్ణ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారని టాక్ వినిపిస్తోంది.

దీంతో కింకర్తవ్యమ్ అనుకుంటున్నారు బాలయ్య 102వ సినిమా జనాలు. ఇక మిగిలినవి రెండే ఆఫ్షన్లు. ఒకటి జయసింహాకు ఫిక్స్ అయిపోవడం లేదూ అంటే, కర్ణ టైటిల్ ఎవరు రిజిస్టర్ చేయించుకున్నారో కనుక్కుని, దాన్ని కొనేసుకోవడం. ఈ రెండో దానికే ఎక్కువ అవకాశం వుందంటున్నారు.

కానీ ఆ ఎవరో తెలియాలి? బేరం కుదరాలి. అప్పుడు టైటిల్ ఫిక్స్ అవ్వాలి. అయినా బాలయ్య సినిమాకు టైటిల్ ఏదయితేనేంటీ? వన్స్ అనౌన్స్ చేస్తే బజ్ అదే వచ్చేస్తుంది. పైసా వసూల్ టైటిల్ అన్నపుడు, ఇదేం టైటిల్ అన్నారు. తరువాత అదే సూపర్ టైటిల్ అయిపోలా?