Home > Movies - Movie News
నాకు పెళ్లయింది.. నేను పనికిరాను

ప్రస్తుతం ఏ హీరో కనిపించినా వాళ్లను రాజకీయాల గురించి ప్రశ్నించడం కామన్ అయిపోయింది. ఒకే సీజన్ లో ఇటు పవన్.. అటు కమల్, రజనీకాంత్, ఉపేంద్ర కూడా రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో మిగతా హీరోలకు ఈ ప్రశ్నలు తప్పడం లేదు. ఇందులో భాగంగా తను కూడా రాజకీయాల్లోకి వస్తానని హీరో విశాల్ ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా దీనిపై మరో హీరో కార్తి కూడా రియాక్ట్ అయ్యాడు. కాకపోతే చాలా వెరైటీగా.

“రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు. మైండ్ మొత్తం దానిపైనే పెట్టాలి. సినిమాలన్నీ వదిలేయాలి. 22గంటలు కేటాయించాలి. బ్యాచిలర్స్ కు రాజకీయాలు కరెక్ట్. విశాల్ లాంటి బ్యాచిలర్ అయితే బాగా చేస్తాడు. నాకు పెళ్లయింది.. నేను పనికిరాను.” పాలిటిక్స్ పై కార్తి రియాక్షన్ ఇది.

కాకపోతే కార్తి సరదాగానే ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రజలకు ఎంతోకొంత మంచి చేయాలనుకున్నప్పుడు రాజకీయాల్లోకే రావాల్సిన అవసరం లేదంటున్నాడు కార్తి.

“పబ్లిక్ లో ఉన్నాం. మాకు ఈ జీవితం ఇచ్చింది పబ్లిక్. అలాంటి వాళ్ల కోసం కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. సంపాదించినది కొంతయినా తిరిగి వాళ్లకు చేరాలి. నేను ఎన్నో సహాయకార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. రాజకీయాల్లోకి వస్తేనే చేయగలం అనుకుంటే పొరపాటు. కాకపోతే పాలిటిక్స్ లోకి వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు.”