Home > Movies - Movie News
కాటమరాయుడికి ముందే మిస్టర్ ట్రయిలర్

చాన్నాళ్ల తరవాత మళ్లీ శ్రీనువైట్ల సినిమా రాబోతోంది. రెండు సినిమాలు సరైన ఫలితాలను సాధించకపోవడంతో, సైలెంట్ అయిన శ్రీను వైట్ల, మొత్తానికి తన స్టామినా ప్రూవ్ చేసుకునే పట్టుదలతో మరో సినిమా తలకెత్తుకున్నారు. ఢీ నుంచి వరుసగా తన రొటీన్ ఫార్ములాకు స్టిక్ అయిపోయిన శ్రీనువైట్లు మళ్లీ మాంచి ఫీల్ గుడ్ ప్లస్ స్టఫ్ వున్న లవ్ స్టోరీని తీసుకున్నారు. వరుణ్ తేజ-లావణ్య త్రిపాఠీ-హెబ్బాపటేల్ తో మిస్టర్ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఏప్రియల్ 14న విడుదలకు రెడీ అయపోతోంది.

ఇప్పటికి రెండు పాటలు మినహా సినిమా అంతా పూర్తయింది. ట్రయిలర్ విడుదలకు రంగం  సిద్దం చేసారు. 22న ట్రయిలర్ ను విడుదల చేస్తారు. సినిమా విషయం దాచి పెట్టేలా కాకుండా, పూర్తిగా విషయం తెలిసేలా ట్రయిలర్ ను శ్రీనువైట్ల కట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాను స్పెయిన్ లో, కర్ణాటకలో చాలా రిచ్ లోకేషన్లలలో చిత్రీకరించడంతో సినిమా ట్రయిలర్ లావిష్ గా కనిపిస్తోందన్నది చూసిన టెక్నికల్ జనాల మాట.

కాటమరాయుడు విడుదలకు ముందే ట్రయిలర్ ను బయటకు తీసుకువచ్చి, థియేటర్లలోకి వదిల్తే, ఉగాది సందర్భంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు రీచ్ అవుతుందని యూనిట్ ప్లాన్ చేస్తోంది.