Home > Movies - Movie News
కాటమరాయుడు సాంగ్స్ అన్నీ వచ్చేశాయ్

మొన్నటివరకు దశలవారీగా పాటలు విడుదల చేశారు. మినిమం గ్యాప్ లో 4 సింగిల్స్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు కాటమరాయుడు సాంగ్స్ అన్నీ యూట్యూబ్ లో సిద్ధంగా ఉన్నాయి. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు సరిగ్గా కొన్ని గంటల ముందు కాటమరాయుడు జూక్ బాక్స్ ను ఆన్ లైన్ లో  పెట్టేశారు. దీంతో ఫ్యాన్స్ లో పవనిజం పొంగిపొర్లుతోంది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కంటే ముందే అభిమానులు పండగ చేసుకోవడం స్టార్ట్ చేశారు.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన కాటమరాయుడు సినిమాలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి సాంగ్ కాదు. లవ్ థీమ్ మాత్రమే. ఈ థీమ్ తో పాటు ఈరోజు కొత్తగా విడుదలైన మిగతా 2 పాటల్ని రిపీటెడ్ గా వింటున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే టోటల్ ఆల్బమ్ లో కొన్ని మాత్రమే క్యాచీగా ఉన్నాయి. ఫస్ట్ రిలీజ్ చేసిన మిరమిర మీసం సాంగ్ తో పాటు మరో 2 పాటల్ని మాత్రమే శ్రోతలు ఎక్కువగా హమ్ చేస్తున్నారు. 

పవన్ కల్యాణ్ సినిమా కాబట్టి విడుదలైన తర్వాత పిక్చరైజేషన్, పవన్ ఎప్పీయరెన్స్ కారణంగా మిగతా పాటలు కూడా క్లిక్ అయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది కాటమరాయుడు మూవీ. 23 నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ఓవర్సీస్ లో గ్రాండ్ గా ప్రారంభంకానున్నాయి.