Home > Movies - Movie News
కాటమరాయుడు కండువా.. కావాలా నాయనా...

రెగ్యులర్ గా ఉండే ప్రమోషన్ తో పాటు కాటమరాయుడు సినిమాకు ఇంకాస్త కొత్తగా ప్రచారం ఇవ్వాలని అనుకున్నారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కొత్త కాన్సెప్టే అయినప్పటికీ... అభిమానుల కోసం అంతకుమించి అందించాలనుంది సినిమా యూనిట్. అందుకే కాటమరాయుడు సినిమాలో పవన్ వాడినలాంటి కండువాల్ని ప్రేక్షకులకు కూడా అందించాలని భావించారు. ఓ వెబ్ సైట్ పెట్టి అందులో కండువాలు అమ్మే కార్యక్రమం మొదలుపెట్టారు. కేవలం కండువాలకే పరిమితం కాకుండా, కాటమరాయుడు పోస్టర్ ప్రింట్ చేసిన వైట్ టీషర్ట్స్ కూడా అమ్ముతున్నారు.

కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ శంకుస్థాపన చేసి ఆపేసినట్టు అనిపిస్తోంది. నిజంగా కాటమరాయుడు యాక్ససిరీస్, గార్మెంట్స్ ను ప్రేక్షకులకు అందించాలంటే చాలా చేయొచ్చు. కానీ ఆన్ లైన్ లో కండువా పెట్టి చేతులు దులుపుకున్నారు. కాటమరాయుడు అని ప్రింట్ చేసిన తువ్వాలు మాత్రమే కొత్తగా ఉంది. పోస్టర్ ప్రింట్ చేసిన టీషర్ట్స్ లు ఎక్కడైనా దొరుకుతాయి. 

"కాటమరాయుడు కండువా మీ మెడచుట్టూ ఉంటే పీకే మీ ప్రతి శ్వాసలో ఉన్నట్టే" అనే క్యాప్షన్ మాత్రం బాగానే పెట్టారు. కానీ కండువాతో పాటు మరిన్ని వస్తువులు ఆన్ లైన్ స్టోర్ లో పెట్టి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఉదాహరణకు పవన్ కల్యాణ్ వాడుతున్న లాంటి చెప్పుల్ని ఆన్ లైన్ పెడితే రెస్పాన్స్ అదిరిపోయేది. ఎందుకంటే, దాదాపు కొన్నేళ్లుగా పవన్ అదే తరహా చెప్పులు వాడుతున్నారు. వీటితో పాటు తెల్ల లుంగీ, మెడలో రుద్రాక్షలు, చేతికి కట్టుకునే నల్లతాడు, పెట్టుకున్న వాచీ లాంటివి కూడా ఆన్ లైన్ లో పెట్టి ఉంటే.. అమ్మకాలు పెరగడంతో పాటు ప్రమోషన్ కూడా వచ్చేది.