Advertisement


Home > Movies - Movie News
కొంపలు కూల్చేస్తున్న కంగనా.!

ఒకప్పుడు వాళ్ళు, ఆమెని వాడుకున్నారు.. ఇప్పుడేమో, కొంపలు కూల్చేస్తోందంటూ గగ్గోలు పెడ్తున్నారు. ఎంత దారుణమైన విషయమిది.? బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనా రనౌత్‌ ఈ మధ్య ఏదో ఒక వివాదంతో వార్తల్లోకెక్కుతోన్న విషయం విదితమే. బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ లవర్‌ కంగనా రనౌత్‌, తన మాజీ బాయ్‌ప్రెండ్‌ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లోకెక్కింది. చిత్రంగా హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుజానే, కంగనా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తన మాజీ భర్తని వెనకేసుకొచ్చింది. 

ఇప్పుడేమో, 'పంచోలీ' కుటుంబం కంగనా వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోసేస్తోంది. ఆదిత్య పంచోలీతో ఒకప్పుడు కంగనా 'ఎఫైర్‌' నడిపిన విషయం విదితమే. ఆ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఆదిత్య పంచోలీపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇక్కడా, ఆదిత్య పంచోలీకి అతని భార్య నుంచి పూర్తి సపోర్ట్‌ లభించింది. కంగనాపై మండిపడిపోయింది ఆదిత్య పంచోలీ భార్య జరీనా వహాబ్‌. 

నిజానికి, మోడలింగ్‌ రంగం నుంచి సినిమాల్లోకొచ్చిన కంగనాపై వున్నన్ని 'ఎఫైర్‌ గాసిప్స్‌' బాలీవుడ్‌లో ఇంకెవరి మీదా లేవేమో.! 'అవకాశాల కోసం ఏం చేయడానికైనా సిద్ధం..' అని ఒకప్పుడు కంగనా ఇచ్చిన డేరింగ్‌ స్టేట్‌మెంట్‌ అప్పట్లో ఓ సంచలనం. అయితే, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆ తర్వాత కంగన క్లారిటీ ఇచ్చిందనుకోండి.. అది వేరే విషయం. 

కంగనా - ఆదిత్య పంచోలి, కంగనా - హృతిక్‌ రోషన్‌, కంగనా - ఇంకొందరు.. ఇలా కంగనా ఎవరెవరి పేర్లతో అయితే వార్తల్లోకెక్కిందో.. తప్పంటూ జరిగితే ఇరువైపులనుంచీ జరిగి వుండాలి. కానీ, చిత్రంగా ఇక్కడ కంగనా రనౌత్‌ టార్గెట్‌ అవుతోంది. తప్పదు మరి, ఇప్పుడు తాపీగా వివాదాలు షురూ చేసింది గనుక, 'కొంపలు కూల్చేస్తోంది' అన్న విమర్శల్ని కంగనా ఎదుర్కోవాల్సిందేనేమో.!

కొసమెరుపు: కంగన కారణంగా హృతిక్‌ విషయంలో అతని మాజీ భార్య సుజానే రూటు మార్చింది. మాజీ భర్త హృతిక్‌ మీద అమితమైన మమకారం ప్రదర్శించేస్తోంది. అంటే, కంగనా కొంపలు కూల్చేస్తున్నట్టనుకోవాలా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ిది.