Advertisement


Home > Movies - Movie News
అజ్ఞాతవాసిని చూసిన అసలు డైరక్టర్

ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ ఆధారంగా అజ్ఞాతవాసిని తెరకెక్కించారంటూ విడుదలకు ముందు నుంచే వార్తలు వస్తున్నాయి. అవి ఆ నోటా ఈ నోటా ఆ ఫ్రెంచ్ డైరక్టర్ చెవిన కూడా పడ్డాయి. అజ్ఞాతవాసి సినిమాను తను కూడా చూస్తానని రిలీజ్ కు ముందే ట్వీట్ చేసిన లార్గో వించ్ డైరక్టర్ జెరోమ్ చెప్పినట్టుగానే సినిమా చూశాడు.

పారిస్ లోని లే-బ్రాడీ మల్టీప్లెక్స్ లో అజ్ఞాతవాసి సినిమా చూసిన జెరోమ్.. తను తీసిన లార్గో వించ్ నుంచి చాలా సన్నివేశాల్ని కాపీ కొట్టేశారని పరోక్షంగా ట్వీట్ చేశాడు. 

"లే-బ్రాడీలో సినిమా చూశా. ఇక్కడ మంచి వాతావరణం కనిపిస్తోంది. ప్రేక్షకులకు థ్యాంక్స్. దురదృష్టవశాత్తూ ఈ సినిమా కథ చాలా మందికి తెలిసిందే." అజ్ఞాతవాసిపై జెరోమ్ ప్రకటన ఇది.

ఎలాంటి అనుమతులు లేకుండా తన సినిమాను కాపీ కొట్టిన వ్యవహారంపై మరో ట్వీట్ లో జెరోమ్ తీవ్రంగా స్పందించాడు. కేవలం టీ-సిరీస్ తో సెటిల్ మెంట్ చేసుకుంటే సరిపోదని అంటున్నాడు. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైందంటున్నాడు జెరోమ్.

టి-సిరీస్ కు కేవలం ఇండియా రైట్స్ మాత్రమే ఇచ్చామని, వరల్డ్ వైడ్ విడుదలైన అజ్ఞాతవాసి సినిమా కేవలం ఇండియాకు పరిమితమైన టి-సిరీస్ తో ఒప్పందానికి వస్తే సరిపోదనేది జెరోమ్ భావన. లార్గో వించ్ సినిమాకు సంబంధించి ఇతర దేశాల్లో కూడా రీమేక్స్ రైట్స్ తీసుకున్న వాళ్లున్నారు కదా. వాళ్ల పరిస్థితేంటని పరోక్షంగా ప్రశ్నిస్తున్నాడు జెరోమ్.