Advertisement


Home > Movies - Movie News
'లిప్‌లాక్‌' తాతయ్యలకు కాదు: వర్మ

తానింకా స్వీట్‌ సిక్స్‌టీన్‌ అనుకుంటున్నట్టున్నాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావుని పట్టుకుని 'తాతయ్య' అనేశారాయన.! 'తాతయ్యా.. మీ కోసం కాదయ్యా ఆ లిప్‌ టు లిప్‌ కిస్‌ పోస్టర్‌..' అంటూ వర్మ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌పై సోషల్‌ మీడియాలో సెటైర్లు వేసేశారు. 

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన 'అర్జున్‌రెడ్డి' సినిమా పోస్టర్‌ వివాదంలో ఇరుక్కున్న విషయం విదితమే. హీరోయిన్ల మధ్య లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్‌ని సినిమా ప్రచారం కోసం చాలా గట్టిగా వాడేశారు. ఆ పోస్టర్లనే వీహెచ్‌ నేతృత్వంలోని కొందరు కాంగ్రెస్‌ నేతలు చించిపాడేశారు. మరోపక్క, అసలు సినిమాలో ఆ లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్‌ లేదనీ, సెన్సార్‌ కత్తెర వేటుకి బలైపోయిందనీ ప్రచారం జరుగుతున్న వేళ వీహెచ్‌ ఆందోళన సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. 

మరోపక్క, ఆ లిప్‌ కిస్‌ పోస్టర్లను సైతం తొలగించేందుకు చిత్ర నిర్మాత ముందుకు వచ్చారంటూ ప్రచారం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో రామ్‌గోపాల్‌ వర్మ, 'అర్జున్‌రెడ్డి' సినిమాకి.. కాదు కాదు, అందులోని లిప్‌ టు లిప్‌ కిస్‌ పోస్టర్‌కి మద్దతుగా నిలవడం ఆశ్చర్యకరమే. 'కందకు లేని డాష్‌ డాష్‌ కత్తిపీటకెందుకు..' అన్నది ఎందుకో తెలుసు కదా.!