Advertisement


Home > Movies - Movie News
సావిత్రి బయోపిక్: బాక్స్ లో ఏముంది?

సావిత్రి కెరీర్, జీవితం ఆధారంగా 'మహానటి' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈరోజు సావిత్రి జయంతి కాబట్టి కచ్చితంగా మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ మెటీరియల్ బయటకొస్తుందని అంతా ఊహించారు. అది నిజమే. కాకపోతే ఏం రిలీజ్ చేయబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

కొద్దిసేపటి కిందట మహానటి యూనిట్ ఈ స్టిల్ రిలీజ్ చేసింది. ఇందులో ఓ చిన్న పెట్టె మాత్రమే ఉంది. సావిత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆ పెట్టె ఉన్న ఫొటో విడుదల చేసి, ఆ బాక్స్ సరిగ్గా 3గంటలకు తెరుచుకుంటుందంటూ ప్రకటించారు. 

మహానటికి సంబంధించి సావిత్రి లుక్ ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికే ఆడియన్స్ కు ఓ అవగాహన ఉంది. సావిత్రి గెటప్ లో ఉన్న కీర్తిసురేష్ పిక్స్ కొన్ని లీక్ అవ్వగా, కీర్తిసురేష్ బర్త్ డే సందర్భంగా యూనిట్ కూడా కళ్లు కనిపించేలా ఓ స్టిల్ రిలీజ్ చేసింది. అచ్చం సావిత్రిని పోలిన హావభావాలు లేక నడకను ఈరోజు విడుదల చేసే అవకాశముంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది మహానటి సినిమా. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, షాలిని పాండే ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు.